ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను ప‌ట్టిపీడిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి దెబ్బ‌కు అగ్ర‌రాజ్యాలు సైతం కుదేల్ అవుతున్నాయి. మొద‌ట చైనాలోని వూహాన్‌లో పుట్టుకొచ్చిన క‌రోనా వైర‌స్ అనాతి కాలంలోనే దేశ‌దేశాలు విస్త‌రించింది. మ‌రోవైపు క‌రోనా కంటికి క‌నిపించ‌క‌పోయినా.. ప్ర‌పంచ‌దేశాలు దీనితో యుద్ధం చేస్తూనే ఉన్నాయి. ఇక క‌రోనాను క‌ట్ట‌డి చేసేందు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో అంద‌రూ ఇంటికే ప‌రిమితం అయ్యారు. ఈ క్ర‌మంలోనే ఉద్యోగులు సైతం ఇంటి నుంచి వ‌ర్క్ చేస్తున్నారు.

 

అయితే ఉద్యోగులు వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తుండ‌డంతో ఇంట‌ర్నెట్‌కు ఎక్క‌డ లేని డిమాండ్ పెరిగిపోయింది. ఇలాంటి స‌మ‌యంలో ఎయిర్‌టెల్ యూజ‌ర్ల‌కు గుడ్‌న్యూస్ చెబుతూ.. సరికొత్త ప్రీపెయిడ్ డేటా ప్లాన్స్‌ని ప్రారంభించింది ఎయిర్‌టెల్. అవే రూ.251, రూ.98 ప్లాన్స్ ప్రకటించింది. ఇందులో ముందుగా.. ఎయిర్‌టెల్ రూ.251 ప్లాన్ రీఛార్జ్ చేసుకుంటే.. 50 జీబీ డేటా లభిస్తుంది. ఇది డేటా ఓచర్ మాత్రమే. అంటే ఇందులో వేలిడిటీ రాదు. ప్రస్తుతం ఉన్న ప్లాన్‌కు అదనంగా 50 జీబీ డేటా లభిస్తుంది. కాబట్టి రెగ్యులర్ ప్లాన్ ఉన్నవారికే ఈ డేటా ప్యాక్ ఉపయోగపడుతుంది. అది కూడా రోజువారి డేటా పూర్తిగా వాడేస్తున్నవారికి ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది.

 

దీంతో పాటు రూ.98 డేటా ఓచర్ కూడా ప్రకటించింది ఎయిర్‌టెల్. రూ.251 ప్లాన్ లాగానే ఇది కూడా పనిచేస్తుంది. రూ.98 ప్లాన్‌లో మీకు కేవలం 12 జీబీ డేటా మాత్రమే లభిస్తుంది. రూ.98 ప్లాన్‌లో కూడా మీకు ఎలాంటి వేలిడిటీ లభించదు. ఇది కూడా రోజువారి డేటా పూర్తిగా వాడేస్తున్నవారికి ఈ ప్లాన్ బాగా యూజ్ అవుతుంది. ఇక వీటితో పాటు ఎయిర్‌టెల్ రూ.2,498 యాన్యువల్ ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రకటించింది. ఈ ప్లాన్ వేలిడిటీ 365 రోజులు. యూజర్లకు రోజూ 2జీబీ డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌లో అన్‌లిమిటెడ్ కాల్స్, రోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు లభిస్తాయి. జీ5 ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్, ఎయిర్‌టెల్ సెక్యూర్ మొబైల్ సెక్యూరిటీ యాంటీ వైరస్ సొల్యూషన్, వింక్ మ్యూజిక్ ప్రీపెయిడ్ సబ్‌స్క్రిప్షన్, హెలో ట్యూన్స్ ఫీగా పొందొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: