యూకే ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ చైనీస్ టెలికాం పరికరాల తయారీ సంస్థ అయిన హువావే టెక్నాలజీస్ కో.లిమిటెడ్ ని తమ ఫైవ్ జి నెట్వర్క్ నిర్మాణం నుండి తొలగిస్తున్నారు. 2023 వ సంవత్సరం లోపు చైనీస్ నెట్వర్కింగ్ హువావే సంస్థ ని తమ 5g నెట్వర్క్ ప్రాజెక్టు నుండి పూర్తిగా తొలగించడం జరుగుతుందని ఆయన అన్నారు. కోవిడ్ 19 మహమ్మారి కారణంగా రైట్ వింగ్ పొలిటిషన్స్ చైనీస్ హువావే సంస్థ నుండి పరికరాలను వాడకూడదని తీవ్రస్థాయిలో వాదనలు చేస్తున్నారు. 


కరోనావైరస్ సంక్షోభం నేపథ్యంలో బ్రిటన్ తమ 5g నెట్‌వర్క్‌లో చైనా టెలికాం పరికరాల తయారీ సంస్థ హువావే టెక్నాలజీస్ కో.లిమిటెడ్ ప్రమేయాన్ని తగ్గించాలని ప్రధాని బోరిస్ జాన్సన్ భావిస్తున్నట్టు ప్రముఖ వార్తాపత్రిక టెలిగ్రాఫ్ వెల్లడించింది. 


బోరిస్ జాన్సన్ అధికారులతో మాట్లాడి బ్రిటిష్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో చైనీస్ ప్రమేయం 2013 లోపు శూన్యం కావాలని ఆదేశించారని ప్రముఖ వార్తా పత్రికల వెల్లడించాయి. చైనా దేశం పై ఏ మాత్రం ఆధారపడకుండా అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తో కలిసి ట్రేడ్ కొనసాగించాలని బ్రిటన్ ప్రభుత్వం యోచిస్తోంది. యూరోపియన్ యూనియన్ నుండి విడిపోయిన తర్వాత యూకే అమెరికాకు దగ్గర కావాలని యోచిస్తోంది. బ్రిటన్ తీసుకున్న నిర్ణయంపై ఇంతవరకు హువావే సంస్థ ఎటువంటి కామెంట్ చేయలేదు. 


శుక్రవారం ఉదయం జాన్సన్ బోరిస్ చైనా దేశం నుండి ఎటువంటి మెడికల్ సదుపాయాలు తమ దేశానికి రాకూడదని ఆంక్షలు పెట్టారు. చైనా రాజధాని బీజింగ్ పై ఇప్పటికే అమెరికా దేశం విమర్శలు గుప్పిస్తున్నది. కరోనా సంక్రమణ గురించి ఇతర దేశాలకు ముందుగానే చెప్పకుండా దాచిపెట్టి ప్రపంచ మానవాళికి ప్రాణహాని కలిగించిందని చైనా దేశం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనా దేశంతో బంధాలు ఉంటాయి కానీ హువావే సంస్థ తో మాత్రం తాము 5g నెట్వర్క్ నిర్మించమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టంచేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: