యూట్యూబ్.. నేటి త‌రంలో ప‌రిచ‌యం అక్క‌ర్లేని యాప్‌. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్లు, తక్కువ మొత్తానికే మొబైల్‌ డేటా అందుబాటులోకి రావ‌డం,  స్మార్ట్ ఫోన్లు కూడా త‌క్కువ ధ‌ర‌కే ల‌భించ‌డంతో.. యూట్యూబ్‌లో వీడియోల వీక్షణ విప‌రీతంగా పెర‌గిపోయింది. చదువుకు సంబంధించిన అంశాల దగ్గర్నుంచి ఏదైనా నేర్చుకోవడం, మ్యూజిక్, ఆరోగ్యం, వంటలు.. ఇలా రకరకాల అవసరాల కోసం నెటిజన్లు యూట్యూబ్‌నే ఎంచుకుంటున్నారు. వినోదాల వీచిక.. నైపుణ్యానికి వేదిక.. యూట్యూబ్ అన‌డంతో సందేహం లేదు. ఒక్క‌ముక్క‌లో చెప్పాలంటే.. స్మార్ట్‌ఫోన్‌ వాడకం ఎంత పెరిగిందో యూట్యూబ్ వినియోగం కూడా అంతే పెరిగింది. మ‌రి ఇలా ఎక్కువ‌గా ఉప‌యోగించే యూట్యూబ్‌లో డార్క్ మోడ్‌ను యూజ్ చేయ‌డం ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి.

 

యూట్యూబ్‌లో డార్క్ మోడ్‌ను ఉపయోగించడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మీ డివైస్ యొక్క బ్యాటరీని ఆదా చేస్తుంది మరియు మీ కళ్ళపై ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది.  అందుకు ముందు మీ ఫోన్‌లో యూట్యూబ్ యాప్ ను ఓపెన్ చేసి అందులో కుడివైపు ఎగువ మూలలో ఉన్న ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. సెట్టింగ్స్ >జనరల్ > అప్పిరియ‌న్స్‌ ను ఎంచుకోండి. త‌ర్వాత అందులో గల డార్క్ థీమ్‌ ఎంపికను ఎంచుకోండి. ఒకవేళ మీరు యూట్యూబ్‌ లో సైన్ ఇన్ అవ్వకపోయిన కూడా మీరు డార్క్ థీమ్‌ను ప్రారంభించవచ్చు. 

 

కానీ సైన్ ఇన్ అవ్వడానికి మొదటగా యూట్యూబ్‌లో మీ యొక్క మెయిల్ ఐడీ తో లాగిన్ అవ్వాలి. అంతే మీ యొక్క యూట్యూబ్ బ్యాక్ గ్రౌండ్ డార్క్ మోడ్ లోకి మారుతుంది. ఇక ఐఓఎస్‌లో మీరు ఇప్పటికి యూట్యూబ్‌ను వాడకుండా ఉంటె కనుక యాప్ స్టోర్ నుండి యూట్యూబ్ యాప్ ను డౌన్‌లోడ్ చేయండి. యాప్ ను ఇన్‌స్టాల్ చేయబడిన తర్వాత దాన్ని ఓపెన్ చేసి అందులో కుడివైపు ఎగువ మూలలో ఉన్న ప్రొఫైల్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. తరువాత తదుపరి స్క్రీన్‌లో సెట్టింగుల మీద నొక్కండి. అందులో గల డార్క్ థీమ్ ఎంపికను‌ను ఎంచుకొని ప్రారంభించండి.  
  

మరింత సమాచారం తెలుసుకోండి: