ప్రముఖ సంస్థ అయిన ఫేసుబుక్ తమ మెసెంజర్ యాప్ లో కొన్ని కీలకమైన అప్డేట్ లు చిన్న పిల్లల సంరక్షణ కొరకు తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఫేసుబుక్ లో ఎంతమంది కేటుగాళ్లు అమాయకులను చిన్నపిల్లలు ఆడవారిని బాగా టార్గెట్ చేస్తున్నారు. అయితే వాళ్లంతా మోసపోకుండా ఉండేందుకు ఫేసుబుక్ తమ మెసెంజర్ చాటింగ్ యాప్ లో సేఫ్టీ ప్రైవసీ ఆప్షన్ అందుబాటులోకి తెచ్చింది. కొత్తవారితో మాట్లాడుతున్నప్పుడు మెసెంజర్ లో ఎప్పటికప్పుడు హెచ్చరికలు తదితర టిప్స్ పాప్ అప్ రూపంలో కనబడతాయి. అనుమానాస్పద ఖాతాల గురించి ముందుగానే హెచ్చరించడంతో పాటు ఇగ్నోర్, బ్లాక్ లాంటి సమర్థవంతమైన ఆప్షన్లను ఇస్తుంది. 


ఫేసుబుక్ సంస్థ ఈ అప్డేట్ ను మార్చి నెల నుండి అందుబాటులోకి తెస్తోంది. ఐఫోన్ యాప్ లో కూడా త్వరలోనే ఈ ఫ్యూచర్ అందుబాటులోకి రానుంది. ప్రైవసీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ(గోప్యత, భద్రత మరియు సురక్షితం) అనేవి మెసెంజర్ ఆప్ వినియోగదారులకు చాలా ముఖ్యమని ఆ సంస్థ తెలిపింది. మా వినియోగదారులందరికీ మెసెంజర్ అనేది సురక్షితమైన ప్లేస్ గా తీర్చిదిద్దేందుకు మేము అందరం కలిసి పని చేస్తున్నాం అని ప్రొడక్ట్ మేనేజ్మెంట్ డైరెక్టర్ జే సుల్వన్ చెప్పుకొచ్చాడు. 


ఇప్పటికే end-end ఎన్క్రిప్షన్ మెసెంజర్ యాప్ లో ఇవ్వబడగా... ప్రస్తుతం ప్రైవసీ సేఫ్టీ సెక్యూరిటీ సెట్టింగులను శక్తివంతంగా మార్చేందుకు ఫేసుబుక్ సంస్థ సన్నాహాలు చేస్తుంది. 18 సంవత్సరాల పై వయస్సు గల వారు చిన్న పిల్లలకు ఎక్కువగా మెసేజ్ లు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతుంటే వారిని గుర్తించి వారిపై నిఘా ఉంచుతామని ఫేస్బుక్ సంస్థ తెలిపింది. అలాగే నా పిల్లలకు వీళ్ళ గురించి ముందుగానే హెచ్చరికలు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తామని ఫేస్బుక్ సంస్థ వెల్లడించింది. పిల్లలను రక్షించడం అనేది తమ తో కూడిన ముఖ్యమైన బాధ్యత. ఫేస్బుక్ మెసెంజర్ లో ఇప్పటికే ఎవరైతే ఎక్కువగా బ్లాక్ కాబడ్డారో వారిని గుర్తించే సదుపాయం ఉంది. ఈ సదుపాయం ద్వారా వారిని చిన్న పిల్లలకు వీలైనంత దూరంగా ఉంచడానికి ఫేస్బుక్ సంస్థ కొన్ని సెట్టింగులను చేర్చింది. తన సరికొత్త ఫ్యూచర్స్ 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలకు అవగాహన కల్పిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: