తాజాగా చైనీస్ హువావే సంస్థ నుండి సరికొత్త స్మార్ట్‌ఫోన్ huawei Enjoy Z 5g చైనా దేశంలో లాంచ్ అయింది. ఈ ఫోన్ కెమెరా సెటప్ గురించి మాట్లాడుకుంటే... 48MP (మెగాపిక్సెల్) మెయిన్ కెమెరాతో పాటు వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ అమర్చారు. huawei Enjoy Z 5g ఫోన్ ముందు భాగంలో వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ కలిగి ఉండగా... ఫోన్ కి పక్కన వైపు సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇవ్వబడింది. ఇకపోతే మొత్తం 4 వెనుక కెమెరాలను రెక్టఅంగుళర్ ఆకారంలో వెనుక ప్యానెల్ యొక్క టాప్ లెఫ్ట్ కార్నర్ లో అమర్చారు. huawei Enjoy Z 5g ఫోన్ మిడ్నైట్ బ్లాక్, స్కై బ్లూ, పింక్ కలర్స్ వేరియంట్ లలో లభించనుంది. ఐతే ఈ ఫోన్ యొక్క స్టోరేజ్ ని మెమరీ కార్డ్ ద్వారా పెంచుకోవచ్చు. 


చైనా లో huawei Enjoy Z 5g ధరల ఒక్కసారి చూసుకుంటే... 6GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న huawei Enjoy Z 5g ధర CNY 1699 అనగా భారతదేశ కరెన్సీ లో 18, 900 రూపాయలు ఉండగా... 6GB ర్యామ్, 128 ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న huawei Enjoy Z 5g ధర CNY 1, 899 అనగా భారతీయ కరెన్సీ లో 20, 200 రూపాయలు ఉంటుంది. 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉన్న huawei Enjoy Z 5g ధర రూ. 23, 400 వరకు ఉంటుందని తెలుస్తుంది. 


Huawei Enjoy Z 5g యొక్క స్పెసిఫికేషన్లు సమగ్రంగా తెలుసుకుంటే... ఈ మొబైల్ ఫోన్ లో 6.57 అంగుళాల ఫుల్ హెచ్ డి lcd display లభిస్తోంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ huawei Enjoy Z 5g ఫోన్ EMUI 10.1 తో ఆండ్రాయిడ్ 10తో వస్తుంది. ఈ ఫోన్లో mediatek dimensity 800 ప్రాసెసర్ ఇవ్వబడింది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ తో 22.5 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఈ మొబైల్ ఫోన్ లో అందించబడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: