గూగుల్ సంస్థ లో భాగమైన గూగుల్ పే కొత్తగా " నియర్ బై స్పాట్ " అనే కొత్త ఆప్షన్ ని 35 నగరాలలో అందుబాటులోకి తీసుకువచ్చింది. ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఈ " నియర్ బై స్పాట్ " అనే ఆప్షన్ ఎక్కువగా ఉపయోగించడం జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. దీనిలో భాగంగానే గూగుల్ సంస్థ గూగుల్ పేర్కొంది. ఈ ఆప్షన్ ని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక అసలు ఈ ఆప్షన్ మనకు ఏవిధంగా ఉపయోగపడుతుందో ఒక సారి చూద్దామా... 


గూగుల్ పే లో బిజినెస్ అనే ఆప్షన్ లో ఈ " నియర్ బై స్పాట్ " అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఇక ఇందులో మన దగ్గరగా ఉండే కిరాణా స్టోర్ లు, ఇంకా అవసరమయ్యే మందుల షాపులు, హోటల్లు, హాస్పిటల్ ఇలా అనేక ఉపయోగపడే వాటి గురించి పూర్తి వివరాలను తెలియజేస్తూ ఇందులో పూర్తి వివరాలను పొందుపరిచారు. అంతేకాకుండా అవి వాటి యొక్క సమయపాలనను తెలుపుతూ, అందులో మనకు కావాల్సిన స్టాక్ అందుబాటులో ఉందో లేదో తెలియజేస్తూ గూగుల్ ఈ ఆప్షన్ ను గూగుల్ ప్లే లో కొత్తగా లాంచ్ చేయడం జరిగింది. అంతే కాకుండా సదరు షాప్ మనకు ఎంత దూరంలో ఉంది అంటూ మళ్లీ గూగుల్ మ్యాప్ ద్వారా లింకు చేసి ఎంత దూరం ఉందో తెలుపుతోంది. అంతేకాదు సదరు షాపు యొక్క ఫోన్ నెంబర్ ని కూడా అందులో తెలియజేయడం జరుగుతుంది. 


ఇకపోతే ప్రస్తుతం ఈ ఆప్షన్ కేవలం భారతదేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, సికింద్రాబాద్, బెంగళూరు, మైసూరు, ముంబాయి, నాగపూర్, నవి ముంబై, చిన్చ్వడ్, ప్రయాగ్ రాజ్, కాన్పూర్, నోయిడా, గ్రేటర్ నోయిడా, విశాఖపట్నం, ఇండోర్, కోల్ కతా, భువనేశ్వర్, లుధియానా, అజిత్ సింగ్ నగర్, చండీగర్, తిరువనంతపురం, కొచ్చి, ఎర్నాకులం ప్రాంతాలలో ఈ ఆప్షన్ ను అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: