యూట్యూబ్ పాపులర్ ఛానల్ 'క్యారిమీన‌టి' ని ఒంటి చేత్తో నడిపిస్తున్న అజయ్ కొన్ని రోజుల క్రితం టిక్ టాక్ VS యూట్యూబ్ అనే ఒక వీడియో క్రియేట్ చేసి టిక్ టాక్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ వీడియో చాలామంది యూట్యూబ్ వీక్షకులకు నచ్చింది కానీ టిక్ టాక్ వినియోగదారులకి మాత్రం బాగా కోపం వచ్చింది. దాంతో ఆ వీడియో పై లక్షల మంది టిక్టాక్ యూజర్లు రిపోర్ట్ చేయగా... ఆ వీడియోని యూట్యూబ్ డిలీట్ చేసింది. క్యారిమీన‌టి వీడియో ని డిలీట్ చేయడం అన్యాయమని... న్యాయం చేయాలంటూ చాలామంది యూట్యూబ్ ఫాలోయర్స్ సామాజిక మాధ్యమాలలో పెద్ద రచ్చ చేశారు. అలాగే టిక్ టాక్ బ్యాన్ చేయాలంటూ గత కొన్ని వారాలుగా సైబర్ నిరసనలు చేస్తున్నారు. 


ఇందులో భాగంగానే లక్షల మంది క్యారిమీన‌టి మద్దతుదారులు గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లి టిక్ టాక్ కి 1 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దాంతో అప్పటివరకు 4.5 స్టార్ రేటింగ్ సంపాదించుకున్న టిక్ టాక్ 1.4 స్టార్ రేటింగ్ కి దిగజారింది. ఈ విధంగా పాపులారిటీ పోగొట్టుకున్న టిక్ టాక్ కి ఇక రోజులు చెల్లిపోయాయని... రేటింగ్ కనుమరుగయినట్టు అతి త్వరలోనే టిక్ టాక్ కూడా భారతదేశంలో కనిపించకుండా పోతుంది అని అందరూ అనుకున్నారు. 


కానీ గూగుల్ మాత్రం వాళ్ల అందరికీ షాక్ తీస్తూ టిక్ టాక్ రేటింగ్ ని యదా స్థాయికి వచ్చేలా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తూ వన్ స్టార్ రేటింగ్ ఇచ్చిన వారందరి కామెంట్లను డిలీట్ చేసింది. రేటింగ్ అండ్ రివ్యూ విభాగాన్ని ఎవరూ దుర్వినియోగం చేయకూడదు అనే ఉద్దేశంతో ఈ దిద్దుబాటు చర్యలు చేపట్టామని గూగుల్ సంస్థ సర్ది చెప్పుకుంది. సరైన కారణం చెప్పకుండా నెగిటివ్ ఫీడ్ బ్యాక్ రేటింగ్ ఇచ్చిన 80 లక్షల స్పందనలను గూగుల్ సంస్థ తొలగించినట్టు తెలుస్తుంది. ఏది ఏమైనా ఇప్పట్లో టిక్ టాక్ బ్యాన్ అవ్వడం దాదాపు అసాధ్యం అని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: