నేటి కాలంలో దాదాపు ప్ర‌తి ఒక్క‌రూ స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు.  ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్లు కనిపిస్తున్నాయి. యువతీయువకులు, పెద్దలు, వృద్ధులు అన్నతేడా లేకుండా అంద‌రూ స్మార్ట్‌ఫోన్‌ను యూజ్ చేస్తున్నారు. ఇక విద్యాలయాలు, కార్యాలయాలు, పనిచేసే చోట ఎక్కడ చూసినా స్మార్ట్‌ఫోన్‌ వినియోగించేవారే. సోషల్ మీడియా వచ్చిన తరువాత అయితే ఈ స్మార్ట్‌ఫోన్ల వినియోగం భారీ స్థాయిలో పెరిగిపోయింది.  ప్రతి ఒక్కరూ సోషల్ మీడియా కోసం స్మార్ట్‌ఫోన్ ని ఉపయోగిస్తున్నారు. అయితే స్మార్ట్ ఫోన్‌లను వాడుతున్న వారు ఎక్కువగా ఫోటోలను లేదా వీడియోలను తీయడానికి మొగ్గు చూపుతారు. 

 

ఇటువంటి వారి కోసం తమ మెమొరీలను ఆన్‌లైన్‌ ద్వారా కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఆన్‌లైన్‌ ద్వారా ఫ్రీగా లభించే ఫోటో బ్యాకప్ సేవల్లో గూగుల్ ఫోటోస్ కూడా ఒకటి. అయితే కొంద‌రు గూగుల్‌లో కూడా ఫోటోల‌ను డిలీట్ చేస్తుంటారు. అయితే ఎప్పుడైనా మీకు కావాల్సిన ఫోటోల‌ను అనుకోకుండా డిలీట్ చేస్తే.. వాటిని తిరిగి పొందడానికి ఒక మార్గం ఉంది. మ‌రి మొబైల్ ద్వారా గూగుల్ ఫోటోస్ నుండి తొలగించిన ఫోటోలను మ‌ళ్లీ ఎలా తిరిగి పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఇందుకు ముందుగా.. మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫోటోస్ లను ఓపెన్ చేసి ఎడమవైపు ఎగువున గల హాంబర్గర్ చిహ్నాన్ని క్లిక్ చేయండి. తరువాత అందులో గల ట్రాష్ ఎంపికను ఎంచుకోండి. మీరు రిస్టోర్ చేయాలనుకుంటున్న ఫోటోల మీద ఎక్కువసేపు నొక్కడం ద్వారా వాటిని ఎంచుకోవచ్చు. పూర్తయిన తర్వాత రిస్టోర్ మీద క్లిక్ చేయండి.   మీరు ఫోటోలను తిరిగి పొందినప్పుడు మీ ఫోటోలు ఆటోమ్యాటిక్ గా ఫోటో లైబ్రరీలో సేవ్ చేయబడతాయి. అంతే.. మీరు డిలీట్ చేసిన ఫోటోల‌ను మ‌ళ్లీ తిరిగి పొందండి. అయితే మీరు గూగుల్ ఫోటోస్ నుండి ఫైళ్లను తొలగించిన రెండు నెల‌ల‌ తర్వాత అయితే తిరిగి పొందాలనుకుంటే మాత్రం కొంచెం కష్టం.

 
 
 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: