శాంసంగ్.. ఈ ప్రత్యేక స్మార్ట్ ఫోన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ ఇప్పుడు మరో సరికొత్త అద్భుతమైన స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుంది. అయితే ఆ స్మార్ట్ ఫోన్ ఏదో కాదు.. శాంసంగ్ గెలాక్సీ ఎం 31. ఈ స్మార్ట్ ఫోన్ 4జీబీ ఈ సంవత్సరం ఫిబ్రవరి 25న భారత మార్కెట్లో లాంచ్ అయ్యింది. 

 

అయితే ఈ స్మార్ట్ ఫోన్ భారీ బ్యాటరీ సామర్థ్యంతో క్వాడ్‌ కెమెరా సెటప్‌తో 16 వేల రూపాయలకు విడుదల అయ్యింది. అయితే ఇప్పుడు ఇందులోనే గెలాక్సీ ఎం 31 సిరీస్ లో 8 జీబీ ర్యామ్ వేరియంట్ విడుదల అవ్వనుంది. అయితే ఈ 8జీబీ ర్యామ్ + 128జీబీ ర్యామ్ వేరియంట్ స్మార్ట్ ఫోన్ 19 వేల 999 రూపాయలకు లాంచ్ అవ్వనుంది. 

 

శాంసంగ్‌  'గెలాక్సీ ఎం 31' 8జీబీ ర్యామ్ వేరియంట్ ఫీచర్లు.. 

 

8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, 6జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌ ,

 

6.4 అంగుళాల డిస్‌ప్లే , 

 

ఎక్సినోస్ 9611 సాక్‌, 64 ఎంపీ ప్రధాన కెమెరా వెనుక క్వాడ్‌ కెమెరాలు + సెల్పీ కెమెరా,

 

6.40 అంగుళాల పూర్తి హెచ్‌డీ ప్లస్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే, 

 

6000 ఎంఏహెచ్ బ్యాటరీ. 

 

శాంసంగ్  'గెలాక్సీ ఎం 31' 8జీబీ ర్యామ్ వేరియంట్ ఈరోజు రాత్రి అఫీషియల్ గా ఫ్లిప్ కార్ట్ లో లాంచ్ అవ్వనుంది.                                                          

మరింత సమాచారం తెలుసుకోండి: