టిక్‌టాక్‌.. ఈ యాప్ గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సినిమాల్లో పాటలు, డైలాగ్ లకు లింప్ సింక్ ఇస్తూ, డ్యాన్సులు వేస్తూ యూత్ ఈ యాప్ ని విపరీతంగా వాడేస్తున్నారు. చైనీస్ ఇంటర్నెట్ టెక్నాలజీ కంపెనీ "బైటీ డ్యాన్స్"టిక్ టాక్ ను డెవలప్ చేసింది. అయితే ఇటీవ‌ల కాలంలో చైనాపై వ్యతిరేకతతో చాలా మంది చైనా యాప్స్ వాడటం మానేస్తున్నారు. టిక్‌టాక్ యాప్ సైతం చైనాకి చెందిన బైట్ డాన్స్ కంపెనీ రూపొందించినది కావడంతో... ఇండియాలో చాలా మంది ఈ యాప్‌ను ప‌క్క‌న పెడుతున్నారు. అయితే ఇదే స‌మ‌యంలో టిక్‌టాక్‌కు పోటీగా వచ్చిన మిత్రోన్‌ యాప్‌ ఈ మధ్యకాలంలో బాగా పాపులర్ అయిన సంగ‌తి తెలిసిందే.

 

మిత్రోన్‌ యాప్ అచ్చం  టిక్‌‌టాక్ యాప్ లాగానే ఉంటుంది. అకౌంట్ లేకుండా కూడా స్వైప్ చేస్తూ వీడియోలు చూడొచ్చు. వీడియోలు క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, షేర్ చేయడానికి ఈ యాప్‌‌లో సింపుల్ యాక్సెస్ ఉంటుంది. అలాగే ఈ యాప్‌ని ఇప్పటికే 50 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో ఆ యాప్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ప్ర‌స్తుతం ఈ యాప్‌కు రేటింగ్ 4.7గా ఉంది. అయితే రివ్యూల్లో ఉన్న కంటెంట్ లో మాత్రం విమర్శలే ఎక్కువగా ఉన్నాయి. ఎన్నో లోపాలున్నట్లు వినియోగదారులు అంటున్నారు. కానీ, ఇది భారతీయ యాప్ కావడం కారణంగానే దీనికి మంచి రేటింగ్ ఇస్తున్నట్లు తెలిపారు.

 

ఇక తాజాగా ఈ యాప్ గురించి మ‌రిన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. మిత్రాన్ యాప్ సృష్టించిన శివంక్ అగర్వాల్... సోర్స్ కోడ్‌ని తక్కువ రేటుకి కొని దాన్ని పూర్తిగా డెవలప్‌ చెయ్యకుండానే యాప్ ప్రారంభించారంటున్న సైబర్ సెక్యూరిటీ నిపుణులు... ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్నవారికి ఇబ్బందులు తలెత్తుతాయని అంటున్నారు. సాధారణంగా కస్టమర్లు కోడ్‌ను వినియోగించి సొంతంగా యాప్‌ను అభివృద్ధి చేసుకుంటారని, కానీ మిత్రో మాత్రం లోగోను మార్చి వారి స్టోర్‌లో అప్‌లోడ్‌ చేసిందని అంటున్నారు. అందుకే సోర్స్‌ కోడ్‌లో మార్పులు చేసిన తర్వాతే వాడటం మంచిదంటున్నారు. ప్రజెంట్ ఆ యాప్ వాడితే... వ్యక్తిగత డేటాకి భద్రత ఉండదని చెబుతున్నారు. కాబ‌ట్టి, ఈ యాప్‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలంటున్నారు.


 
 

మరింత సమాచారం తెలుసుకోండి: