గూగుల్ సంస్థ లో భాగమైన 'ది ఆల్ఫాబెట్. ఇంక్' అనేది తమ వినియోగదారులు ఇంటర్నెట్ లో ఏం చేస్తున్నారో, ఎక్కడికి వెళ్తున్నారో అనే సమాచారాన్ని ఎవరి అనుమతి తీసుకోకుండానే కలెక్ట్ చేస్తుందన్న ఆరోపణలు ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ సంస్థ కోట్ల మంది వినియోగదారుల సమాచారాన్ని సేకరించినందుకు గాను ఐదు మిలియన్ల డాలర్లను నష్టపరిహారం చెల్లించాలని కాలిఫోర్నియాలోని సాన్ జోస్ కు చెందిన ఫెడరల్ కోర్టు ఫిర్యాదు నమోదయింది. అసలు విషయం చెప్పాలంటే... గూగుల్ సంస్థ యొక్క బ్రౌజర్ ద్వారా ఇంకాగ్నిటో మోడ్(incognito mode) లో బ్రౌజ్ చేయబడిన వ్యక్తిగత సమాచారాన్ని సేకరించడం పై ఫిర్యాదు నమోదయింది. వాస్తవానికి గూగుల్ సంస్థ తమ ఇంకాగ్నిటో మోడ్ లో బ్రౌజింగ్ కి సంబంధించిన సమాచారం స్టోర్ చేయబడదు అని హామీ ఇచ్చింది. కానీ ఈ గూగుల్ సంస్థ తమ గూగుల్ అనలిటిక్స్, గూగుల్ యాడ్ మేనేజర్ ఇంకా తదితర యాప్స్ ద్వారా వినియోగదారుల సమాచారాన్ని దొంగలిస్తుంది. వెబ్సైటు ప్లగ్ ఇన్స్ ద్వారా కూడా గూగుల్ సంస్థ వినియోగదారుల వ్యక్తిగత సమాచారాన్ని కలెక్ట్ చేస్తోంది. తమ యూజర్లు గూగుల్ ఆధారిత యాడ్స్ పైన క్లిక్ చేయక పోయినా... గూగుల్ సంస్థ మాత్రం వినియోగదారులను సమాచారాన్ని సేకరిస్తుంది. 


ఈ విధంగా సమాచారాన్ని సేకరించడం వలన తనకి వినియోగదారుల యొక్క హాబీలు, స్నేహితులు, ఇష్టమైన ఆహారం, షాపింగ్ అలవాటులు, ఇంకా అనేకమైన వ్యక్తిగత విషయాలను కూడా గూగుల్ సంస్థ తెలుసుకోగలదు. ఉదాహరణకి మీరు ఏదైనా ప్రైవేటు వస్తువు కోసం వెతికితే... ఆ వస్తువు ఏంటన్నది గూగుల్ కి తెలిసిపోతుంది. ఈ విధంగా కూడా సంస్థ మొబైల్ ఫోన్, ల్యాప్టాప్స్, కంప్యూటర్ల వినియోగదారుల సమాచారాన్ని సేకరించడం సరైంది కాదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 


గూగుల్ సంస్థ ప్రతినిధి జోస్ కాష్ఠనేదా మాట్లాడుతూ... తమ కంపెనీ పైన వస్తున్న ఆరోపణలను సమర్థవంతంగా ఎదుర్కొంటామని తెలిపాడు. మీరు ఇంకాగ్నిటో మోడ్(incognito mode) ఓపెన్ చేసిన ప్రతిసారీ... మీరు విజిట్ చేసే వెబ్సైట్లు సమాచారాన్ని సేకరించగలవని మేము హెచ్చరిస్తున్నాం' అని జోస్ అన్నారు. 2016 వ సంవత్సరం నుండి వినియోగదారుల సమాచారాన్ని సేకరించినందుకు నష్టపరిహారంగా ప్రతి వినియోగదారునికి ఐదు వేల డాలర్లను చెల్లించాలని కాలిఫోర్నియా రాష్ట్రం తమ ఫిర్యాదులో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: