వన్ ప్లస్.. ఒకప్పుడు ఐఫోన్ అంటే గ్రేట్ అని అనేవారు.. కానీ ఇప్పుడు వన్ ప్లస్ ని గ్రేట్ అంటున్నారు. సూపర్ ఫోన్ అంటూ ఒకటే పొగిడేస్తున్నారు. అంత బాగుంటుంది ఈ వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్. ఇంకా ఈ వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన సెల్ ఇప్పుడు మన దేశంలో కూడా రోజు జరుగుతుంది. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలనుండి ఈ సెల్ ప్రారంభం కానుంది. 

 

అయితే ఇటీవలే లాంచ్ అయినా వన్ ప్లస్ 8, వన్ ప్లస్ 8 ప్రో స్మార్ట్ ఫోన్లకు సంబంధించిన సేల్ జరగాల్సి ఉన్నప్పటికీ ఉత్పత్తికి సంబంధించిన సమస్యల కారణంగా అప్పుడు జరగలేదు. అయితే ఇప్పుడు ఆ సమస్య లేకపోవడం ఈ వన్ ప్లస్ 8కు సంబంధించిన ఫ్లాష్ సేల్ ఈరోజు జరగనుంది. 

 

ఇంకా ఈ స్మార్ట్ ఫోన్స్ పై పలు అద్భుతమైన సేల్స్ ఉన్నాయి. అవి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం.. 

 

వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.41,999గా నిర్ణయించారు. 

 

వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,999గా నిర్ణయించారు. 

 

 ఇంకా అదే వన్ ప్లస్ 8 స్మార్ట్ ఫోన్ హైఎండ్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.49,999గా నిర్ణయించారు. 

 

ఇంకా ఈ స్మార్ట్ ప్రత్యేకతలు.. స్పెసిఫికేషన్లు ఇవే!

 

6.55 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లే,

 

ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్, 

 

48 మెగా పిక్సెల్ + 2 మెగా పిక్సెల్ మాక్రో లెన్స్ + 16 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్,

 

సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్, 

 

బ్యాటరీ సామర్థ్యం 4,300 ఎంఏహెచ్.

మరింత సమాచారం తెలుసుకోండి: