సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 లాంచ్ అయ్యేందుకు ఇంకా చాలా సమయం ఉంది కానీ ఇప్పటికే ఆ ఫోన్ కి సంబంధించిన అనేక లీక్స్, రూమర్స్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం సాంసంగ్ సంస్థ గెలాక్సీ నోట్ సిరీస్ మొబైల్ ఫోన్లను పెంచుతూ ఈ సంవత్సరం ఎంత లేదనుకున్నా మూడు సరికొత్త గెలాక్సీ నోట్ 20 స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. గతంలో విడుదలైన గెలాక్సీ ఎస్ 20 అల్ట్రా ఫోన్స్ మార్కెట్ లో సూపర్ గా అమ్ముడుబోయాయి. ఆ విజయాన్ని దృష్టిలో పెట్టుకొని గాలక్సీ నోట్ 20 అల్ట్రా స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తెచ్చేందుకు సాంసంగ్ సంస్థ యోచిస్తోంది. 


గతంలో నోట్ 10 ప్లస్, నోట్ 9+ లాగా ప్లస్ సిరీస్ లను సాంసంగ్ సంస్థ మార్కెట్లోకి తెచ్చేది. కానీ ఇటీవల సాంసంగ్ S20 అల్ట్రా అనే అల్ట్రా సిరీస్ ని మార్కెట్లో విడుదల చేసి బాగా లాభాలను ఆర్జించింది. అందుకే అల్ట్రా సిరీస్ స్మార్ట్ ఫోన్ లను విడుదల చేయడం ప్రారంభించి... ప్లస్ సిరీస్ ఫోన్లకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు సాంసంగ్ ముందడుగులు వేస్తోంది. సమీప భవిష్యత్తులో విడుదలయ్యే సాంసంగ్ గెలాక్సీ నోట్ 20 ఎటువంటి ప్లస్ ట్యాగ్ తో విడుదల అవ్వవు కానీ అల్ట్రా అనే ట్యాగ్ తప్పకుండా ఉంటుందని తెలుస్తుంది. 


దీన్ని బట్టి సాంసంగ్ సంస్థ నుండి గాలక్సీ నోట్ 20, గాలక్సీ నోట్ 20 అల్ట్రా స్మార్ట్ ఫోనులు విడుదలవుతాయని తెలుస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే ఇప్పటికే అనేక సోర్సుల నుండి లీక్ అయిన ఫోటోలు డిజైన్ నిజమేనని అనుకోవచ్చు. ఇప్పటి వరకు విడుదలైన ఫోటోలు ప్రకారం గాలక్సీ నోట్ 20 +(నోట్ 20 అల్ట్రా) యొక్క ఫ్రంట్ సైడ్ అచ్చం S20 లాగానే ఉంటుందని తెలుస్తోంది. బాక్సీ డిజైన్ తో కర్వుడ్ డిస్ప్లేతో గెలాక్సీ నోట్ 20 స్మార్ట్ ఫోనులు లభిస్తాయని తెలుస్తోంది. అలాగే విడుదలైన ఫోటోలలో గెలాక్సీ నోట్ 20 లో S-pen పెట్టుకునే ప్లేస్ ఇప్పటి వరకు విడుదలైన అన్ని నోట్ సిరీస్ లలో లాగానే ఉంటుందని... S-pen ప్లేస్మెంట్ ఎటువంటి మార్పులు నోట్ 20 తీసుకురాలేదని తెలుస్తోంది. గెలాక్సీ నోట్ 20 అల్ట్రా... 165 మిల్లీ మీటర్ల పొడవు, 77. 2 మిల్లీమీటర్ల వెడల్పు, 7.6 మిల్లి మీటర్ల మందం ఉంటుందని లీక్స్ లలో తెలుస్తుంది. అలాగే డిస్ప్లేయ్ సైజు ఒక అంగుళం పెరిగి 6.9 అంగుళాల వరకు నోట్ 20 సైజు పెరుగుతుందని ఇప్పటివరకు వచ్చిన లీక్స్ చెబుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: