భార‌త ఆర్మీ అమ్ముల పొదిలో చేరేందుకు స్వ‌దేశీయంగా త‌యారు చేయ‌బ‌డిన తేజ‌స్ ఎన్ యుద్ధ వివ‌మానం సిద్ధ‌మ‌వుతోంది. ప్రొటోటైప్ ‘తేజస్ ఎన్’ యుద్ధవిమానాన్ని ఇప్ప‌టికే ప‌లు ప‌రీక్షల్లో నిల‌బెట్ట‌గా దిగ్విజ‌యం సాధించింది. నేవీ ఎయిర్​క్రాఫ్ట్ క్యారియర్ ‘ఐఎన్ఎస్ విక్రమాదిత్య’పై జరిపిన ట్రయల్ ల్యాండింగ్స్ సక్సెస్ అయ్యాయి. దేశంలోనే తయారు చేసిన ‘తేజస్ ఎన్’.. వచ్చే ఆరేళ్లలో ఎయిర్​ఫోర్స్​లోకి చేరనుంది. మిగ్ -21 యుద్ధ విమానాల స్థానాన్ని భ‌ర్తీ చేసేందుకు  1980 లలో మొదలుపెట్టిన లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఎల్‌సిఎ) కార్యక్రమం నుంచి రూపుదిద్దుకున్న విమానమే తేజస్. 2003 లో, ఈ యుద్ధవిమానానికి అధికారికంగా "తేజస్" అని పేరు పెట్టారు.


 తేజస్, భారతదేశం అభివృద్ధి చేసి, తయారు చేసిన యుద్ధ విమానం. డెల్టా వింగ్ కలిగిన ఏక ఇంజను తేజస్, మల్టీరోల్ లైట్ కాంబాట్ను క‌లిగి ఉంటుంది. భారత ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (ఎడిఎ), హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్) లు సంయుక్తంగా క‌ల‌సి రూపొందించాయి. దీనిని భారత వైమానిక దళం, భారత నావికాదళాలకు అందించ‌డ‌మే ల‌క్ష్యంగా త‌యారు చేయ‌బ‌డుతున్నాయి. ఈ యుద్ధ విమానం అనేక ఆధునిక‌త‌ల క‌ల‌బోత‌గా చెప్ప‌వ‌చ్చు. తేజస్ తోక లేని సంయుక్త డెల్టా-వింగ్ కాన్ఫిగరేషన్‌ను, ఒకే డోర్సల్ ఫిన్‌తో కలిగి ఉంటుంది. సంప్రదాయ వింగ్ డిజైన్ల కంటే మెరుగైన హై-ఆల్ఫా పనితీరును అందిస్తుంది.  దీని వింగ్ రూట్ లీడింగ్ ఎడ్జ్ 50 డిగ్రీల స్వీప్, బాహ్య వింగ్ లీడింగ్ ఎడ్జ్ 62.5 డిగ్రీల స్వీప్, వెనుక ఉన్న అంచు నాలుగు డిగ్రీల ఫార్వర్డ్ స్వీప్ కలిగి ఉంటుంది.  


రిలాక్స్‌డ్ స్టాటిక్ స్టెబిలిటీ, ఫ్లై-బై-వైర్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్, మల్టీ-మోడ్ రాడార్, ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఏవియానిక్స్ సిస్టమ్, మిశ్రమ పదార్థ నిర్మాణాల వంటి సాంకేతికతలను తేజస్‌లో సమకూర్చారు. ఐఏఎఫ్ అడ్వాన్స్‌‌‌‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌‌‌‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) కోసం అభివృద్ధి చేస్తున్న టెక్నాలజీలను ఈ కొత్త జెట్ లో ఏర్పాటు చేయొచ్చని ఈ ప్రోగ్రామ్​లో పాల్గొన్న నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రోటోటైప్ జెట్ డిజైన్లు మరింత నమ్మకమైనవని అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. 2025లో తేజస్ ఎంకే2ను ఎయిర్​ఫోర్స్​లోకి తీసుకు వ‌చ్చేందుకు కృషి చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: