మిత్రోన్ యాప్.. ఈ పేరు గ‌త కొన్ని రోజులు నుంచీ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. చైనా నుంచి అన్ని వస్తువుల్లాగే టిక్ టాక్ యాప్ కూడా విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అయితే చైనా  టిక్ టాక్ యాప్ కు దీటుగా ఓ భారతీయ సంస్థ తీసుకువచ్చిన యాప్ మిత్రోన్ యాప్. మిత్రోన్‌ యాప్ అచ్చం  టిక్‌‌టాక్ యాప్ లాగానే ఉంటుంది. అకౌంట్ లేకుండా కూడా స్వైప్ చేస్తూ వీడియోలు చూడొచ్చు. వీడియోలు క్రియేట్ చేయడం, ఎడిట్ చేయడం, షేర్ చేయడానికి ఈ యాప్‌‌లో సింపుల్ యాక్సెస్ ఉంటుంది. 

 

ఇక సరిహద్దులో పరిణామాలతో దేశంలో చైనా వ్యతిరేకత పెరిగిపోగా.. చైనా వారి టిక్ టాక్ కు పోటీగా వచ్చిన మిత్రోన్ విశేషమైన ప్రజాదరణ అందుకుంది. ఈ క్ర‌మంలోనే మిత్రోన్‌ యాప్‌ని 50 లక్షల మందికిపైగా డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీనికి చాలా మంది మంచి రేటింగ్ కూడా లభిస్తోంది. ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో ఈ యాప్ రేటింగ్ 4.7గా ఉంది. అయితే అనాతి కాలంలోనే భారీ పాపులారిటీ సంపాదించుకున్న ఈ మిత్రోన్‌ యాప్‌ను గూగుల్ స‌డెన్‌గా తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. థర్డ్ పార్టీ యాప్‌లను తొలగించాలని ప్రోత్సహించేలా ఈ యాప్ ఉండటం.. తమ పాలసీకి విరుద్ధమని అందుకే ఈ యాప్ తొలగించినట్లు గూగుల్ పేర్కొంది.

 

అయితే మిత్రోన్ యాప్ మ‌ళ్లీ గూగుల్ ప్లేస్టోర్‌లో ద‌ర్శ‌న‌మిచ్చింది. తాము ఈ యాప్‌ని అప్‌డేట్ చేశామనీ... ప్రైవసీ పాలసీని కూడా మార్చామి మిత్రాన్ తెలిపింది. తాజాగా జీడీపీఆర్‌ డేటా ప్రొటెక్షన్ రైట్స్ పేజీ కూడా యాడ్ చేసింది. ఇంతకు ముందు ఈ ప్రైవసీ పాలసీ విషయంలోనే గూగుల్ అభ్యంతరాలు తెలిపింది. పాలసీ సరిగా లేనందువల్ల ప్లే స్టోర్ నుంచి తొలగిస్తున్నట్లు చెప్పింది. అయితే ఇప్పుడు మిత్రాన్ మళ్లీ యాడ్ అవ్వడం, దీన్ని ఓ భారతీయుడు తయారుచెయ్యడంతో... ఈ సారి టిక్‌టాక్‌కి మిత్రోనో యాప్ గ‌ట్టి పోటీ ఇస్తుంద‌ని అంటున్నారు.

 
 

మరింత సమాచారం తెలుసుకోండి: