ఫేసుబుక్ సంస్థ సొంతమైన వాట్సాప్ గత కొన్ని నెలలుగా పేమెంట్స్ ఫ్యూచర్ ని వినియోగదారులకి అందుబాటులోకి తేవాలన్న యోచనలో ఉంది. ఐతే చాలా చర్చల తర్వాత ట్రైల్స్ తర్వాత ఇటీవలే వాట్సాప్ మెసేజింగ్ యాప్ పేమెంట్స్ ఆప్షన్ ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. మొట్టమొదటిగా బ్రెజిల్ దేశంలో ఈ ఆప్షన్ అందుబాటులోకి రాగా... తదనంతరం ఇతర దేశాల్లో కూడా ఈ ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. గత సంవత్సరం ఫేసుబుక్ సంస్థ ఫేసుబుక్ పే అనే పేమెంట్స్ మెథడ్ ఆప్షన్ ని మెసెంజర్ యాప్ లో పొందుపరచిన సంగతి తెలిసిందే. 


సామాన్య వినియోగదారుడు మనీ ట్రాన్సాక్షన్ చేస్తున్నప్పుడు ఎటువంటి ప్రాసెసింగ్ ఫీజు కట్టక్కర్లేదు కానీ వ్యాపారస్తులు మాత్రం వాట్సాప్ పేమెంట్ వినియోగించాలంటే 3.99 శాతం ప్రాసెసింగ్ ఫీజు కట్టాల్సి ఉంటుంది. ఈ ఆప్షన్ వినియోగించాలంటే మీరు మీ బ్యాంకు అకౌంట్ ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో ఆ ఫోన్ నెంబర్ తో వాట్సప్ అకౌంట్ రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాట్సప్ అప్లికేషన్ లోని సెట్టింగ్ లలో పేమెంట్స్ ఆప్షన్ పై క్లిక్ చేసి మీ యూపీఐ అకౌంట్, బ్యాంక్ అకౌంట్ కి సంబంధించిన ఇతర సమాచారం కూడా పొందుపరచవలసి ఉంటుంది. ఈ ప్రాసెస్ పూర్తి చేసిన అనంతరం మీరు ఎవరికి డబ్బులు పంపాలనుకుంటున్నారో ఆ వ్యక్తి చాట్ ఓపెన్ చేసి ఎటాచ్మెంట్ ఐకాన్ పై క్లిక్ చేసి పేమెంట్స్ ఆప్షన్ ని ఎంపిక చేసుకోవాలి. అనంతరం మీరు సెండ్ చేయాలనుకుంటున్న అమౌంట్ ని మెసేజ్ పంపినంత ఈజీగా ట్రాన్స్ఫర్  చేయవచ్చు. 


ఇకపోతే మన దేశంలో 40 కోట్ల మంది ప్రజలు వాట్సాప్ ని వినియోగిస్తున్నారు. ఈ 40 కోట్ల మంది ప్రజల కోసమైనా వాట్సాప్ సంస్థ పేమెంట్స్ ఆప్షన్ని త్వరలోనే ప్రవేశ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా వాట్సాప్ పేమెంట్ ఆప్షన్ వినియోగదారుల ట్రాన్సాక్షన్ పనులను అతిసులభం చేస్తుందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: