రెడ్ మీ.. అతి తక్కువ ధరకే అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను అందిస్తున్న బ్రాండ్. ఇంకా ఈ రెడ్ మీ నుండి ఇప్పుడు మరో అద్భుతమైన ఫోన్ లాంచ్ అయ్యింది. అదే రెడ్ మీ నోట్ 9 ప్రో స్మార్ట్ ఫోన్. ఇంకా ఈ ఫోన్ కు సంబంధించిన సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది. అమెజాన్, ఎంఐ.కాం వెబ్ సైట్లలో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉండనుంది.

 

అయితే మూడు నెలల క్రితం మార్చిలోనే మన దేశంలో లాంచ్ అయ్యింది. కానీ కరోనా వైరస్ కారణంగా ఈ ఫోన్ కి సంబంధించిన సెల్ ఆగిపోయింది. అయితే ఇప్పుడు అదే సెల్ నేడు అమెజాన్ లో జరగనుంది. మరి ఈ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లు, ధర ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి. 

 

రెడ్ మీ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఇవే!

 

6.67 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ డిస్ ప్లే,

 

ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 5 మెగా పిక్సెల్ టెర్టియరీ సెన్సార్ + 2 మెగా పిక్సెల్ క్వార్టెనరీ సెన్సార్ లను ఇందులో అందించారు. 

 

సెల్ఫీ కెమెరా 16 మెగాపిక్సెల్. 

 

బ్యాటరీ సామర్థ్యం 5,020 ఎంఏహెచ్ గా ఉంది. 

 

రెడ్ మీ 9 ప్రో స్మార్ట్ ఫోన్ లో రెండు వేరియంట్లు ఉన్నాయ్.. 

 

4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. 

 

6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.16,999గా నిర్ణయించారు. 

 

అరోరా బ్లూ, గ్లేసియర్ వైట్, ఇంటర్ స్టెల్లార్ బ్లాక్ కలర్లలో ఈ స్మార్ట్ ఫోన్ అందుబాటులో ఉన్నాయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి: