మొబైల్ మార్కెట్లో దూసుకుపోతున్న దక్షిణ కొరియాకి చెందిన ఎలక్ట్రానిక్‌ దిగ్గజ సంస్థ శాంసంగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. యువత ఆలోచనలకు తగ్గట్టుగా కంపెనీ ఎప్ప‌టిక‌ప్పుడు నయా మోడల్స్ విడుదల చేస్తోంది. రోజుకో కొత్త రకం ఫీచర్‌తో, విభిన్నమైన డిజైన్స్‌తో స్మార్ట్‌ఫోన్ల‌ను విడుద‌ల చేస్తూ అంద‌రినీ త‌న‌వైపుకు తిప్పుకుంటుంది శాంసంగ్‌. ఇక త్వ‌ర‌లోనే శాంసంగ్ మ‌రో బ‌డ్జెట్ ఫోన్‌ను విడుద‌ల చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. అదే గెలాక్సీ ఏ01 కోర్. కొద్దిరోజుల క్రితం ఈ ఫోన్ గూగుల్ ప్లే కన్సోల్ లో కనిపించింది. 

 

అయితే ప్రస్తుతం ఈ ఫోన్ లీక్డ్ ఫొటోలు ఆన్ లైన్ లో ప్రత్యక్షమయ్యాయి. ఈ ఫొటో ద్వారా ఆ ఫోన్ డిజైన్ గురించి పూర్తిగా తెలిసిపోయింది. ఈ ఫోటోల ఆధారంగా.. గెలాక్సీ ఏ01 కోర్ వెనకవైపు సింగిల్ కెమెరా, దాని కిందనే ఫ్లాష్ కూడా ఉంది. ముందువైపు పాత ఫోన్ల తరహాలో బెజెల్స్ ను అందించారు. సెల్ఫీ కెమెరా ఫోన్ పైభాగంలో ఉంది. సెల్ఫీ కెమెరా పక్కనే ఇయర్ పీస్ కూడా అమ‌ర్చి ఉంది. వాల్యూమ్, పవర్ బటన్లు ఫోన్ కుడివైపు ఉన్నాయి. 

 

ఇక లీకైన స‌మాచారం ప్ర‌కారం.. స్పెసిఫికేషన్లు చూస్తే ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. హెచ్ డీ+ డిస్ ప్లేను ఇందులో అందించారు. మీడియాటెక్ HT6739WW ప్రాసెసర్ ను ఇందులో అందించే అవకాశం ఉంది. 1 జీబీ ర్యామ్ ఇందులో ఉండనుంది. శాంసంగ్ గెలాక్సీ ఏ01 కోర్ లో బ్లూటూత్ వీ5 ఫీచర్ ఉండనున్నట్లు ఈ లిస్టింగ్ ద్వారా తెలిసింది. వైఫై అలయన్స్, డ్యూయల్ బ్యాండ్ వైఫై ఫీచర్లు కూడా ఇందులో ఉండనున్నాయి. అయితే ఇందులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. ఇక ఈ ఫోన్ రూ.10 వేల లోపు ధరలోనే లాంచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ఫోటోల బ‌ట్టీ చూస్తే..  రెడ్, బ్లూ రంగుల్లో ఈ ఫోన్ అందుబాటులో రానున్న‌ట్టు తెలుస్తోంది. ఇక ఈ ఫోన్‌ వెనకవైపు పట్టు బాగుండటం కోసం గరుకుగా ఉండే విధంగా ప్యానెల్ ను అందించారు.  
 

మరింత సమాచారం తెలుసుకోండి: