శాంసంగ్.. ఇప్పటికే ఎన్నో అద్భుతమైన స్మార్ట్ ఫోన్లను అందించింది. అయితే ఆలా అందించిన ఓ స్మార్ట్ ఫోన్ పై ఇప్పుడు ఏకంగా 1,000 రూపాయల డిస్కౌంట్ ఇచ్చింది. ఏ ఫోన్ పై అనుకుంటున్నారా? అదేనండి.. శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్. ఇప్పుడు దీనిపై ఏకంగా వెయ్యి రూపాయిలు తగ్గించారు.
అంతేకాదు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,000 క్యాష్ బ్యాక్ లభించనుంది. అంటే ఈ స్మార్ట్ ఫోన్ పై మొత్తంగా రూ.2,000 డిస్కౌంట్ ఇస్తున్నారు. ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో జూన్ లో లాంచ్ అయింది. ఇంకా లాంచ్ అయినా సమయంలో రూ.21,999గా ఉండగా ఇప్పుడు ధర తగ్గింపుతో రూ.20,999కు వచ్చింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్ తో కొనుగోలు చేస్తే రూ.19,999కే కొనవచ్చు.
ఫీచర్లు.. స్పెసిఫికేషన్లు ఇవే..
6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్ ఫినిటీ-యూ డిస్ ప్లే,
వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు.
ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ + 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా + 5 మెగా పిక్సెల్ డెప్త్ కెమెరా + 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలు ఉన్నాయి.
సెల్ఫీ కెమెరాకు 20 మెగా పిక్సెల్ అందించారు.
ఇందులో 128 జీబీ స్టోరేజ్.
ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది.
బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్.
ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ బ్లూ, ప్రిజం క్రష్ వైట్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది.