టిక్‌టాక్.. అన‌తి కాలంలోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఎక్కువ ప్ర‌జాదార‌ణ పొందింది ఈ యాప్‌. ముఖ్యంగా భార‌త్‌లోనే ఆ యాప్‌కు ఎక్కువ క్రేజ్ ల‌భించింది. చైనీస్‌ ఇంటర్నెట్‌ టెక్నాలజీ కంపెనీ బైటీ డ్యాన్స్ ‌టిక్‌టాక్‌ను రూపొందించింది. 2016 లో డౌయిన్‌ పేరుతో ఇది చైనాలో విడుదలైంది. ఆ తర్వాత ఏడాదికి  టిక్‌టాక్ పేరుతో అంతర్జాతీయ మార్కెట్లలోకి ఈ యాప్‌ విడుదల చేశారు. ఈ యాప్‌ ద్వారా జోక్స్‌ క్లిప్స్‌, వీడియో సాంగ్స్‌, సినిమా డైలాగ్స్‌కు లిప్‌ మూమెంట్‌, బాడీ మూమెంట్స్‌ ఇవ్వడం, డ్యాన్స్‌ చేయడం వంటివి దీనిలో చాలా ఈజీగా చేస్తుంటారు. ఈ క్ర‌మంలోనే ఎంద‌రో సామాన్యులు త‌మ ట్యాలెంట్‌ను నిరూపించుకుని స్టార్స్‌గా మారారు.  

 

అయితే ప్ర‌స్తుతం భార‌త్‌లో టిక్‌టాక్ జ‌ర్నీ ముగిసింది. గాల్వాన్ లోయ వద్ద జరిగిన కొట్లాట లో 20 మంది భారత జవాన్ల ప్రాణాలు తీసిన డ్రాగన్ కు బుద్ధి చెప్పేందుకు ఇటీవలే కేంద్రం టిక్ టాక్ సహా 59 మొబైల్ ఆప్స్ ను నిషేధించిన విషయం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే టిక్ టాక్ పనిచేయడం ఆగిపోయింది. ఫోన్ లో టిక్ టాక్ ను రిమూవ్ చేయకుండా..ఆపరేట్ చేసేందుకు ప్రయత్నించినా నో నెట్ వర్క్ కనెక్షన్ అనే మెసేజ్ డిస్ ప్లే అవుతోంది. 

 

అయితే భార‌త్‌లో టిక్‌టాక్ బ్యాన్ అవ్వ‌డంతో.. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా అందుబాటులో ఉన్న మోజ్ యాప్ దూసుకుపోతుంది. 15 భాషలు అందుబాటులో ఉన్న ఈ యాప్.. 15 సెకన్ల వీడియోలను సైతం క్రియోట్ చేయవచ్చు. వీడియో క్వాలిటీ పెంచుకునేందుకు పలు ఆఫ్షన్లు కూడా ఉన్నాయి. టిక్‌టాక్ మాదిరిగానే మోజ్‌లో కూడా లిప్-సింక్ ఫీచర్ ఉంది. దీంతో అంద‌రి క‌న్నా మోజ్ యాప్‌పై ప‌డింది. దీంతో రోజురోజుకు ఆ యాప్ డౌన్‌లోడ్ చేసుకునే వారి సంఖ్య పెరుగుతూ వ‌స్తోంది. మ‌రియు మోజ్ యాప్‌కి 4.3 రేటింగ్ కూడా ఇవ్వ‌డం మ‌రో విశేషం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: