ప్రజల ఆపిల్ఫోన్ తన కొత్త మోడల్ ను మార్కెట్లోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి  ఆపిల్ ఐఫోన్ 12 సిరీస్లో భాగంగా ఐఫోన్ 12 మినీ, ఆపిల్ ఐఫోన్ 12 మోడల్స్ ను తీసుకు వచ్చింది. మరో రెండు ఫోన్లను అతి త్వరలో మళ్లీ రిలీజ్ చేయబోతున్నారు. కాకపోతే ఐ ఫోన్ తో పాటు చార్జర్ అందించలేదు ఆపిల్ సంస్థ. దీనిపై ఆపిల్ ఫోన్ వినియోగదారులు పెద్ద ఎత్తున మండిపడుతున్నారు. వేలకు వేలు పోసి మొబైల్ కొనగానే మళ్ళీ సపరేట్ గా చార్జర్ కోసం డబ్బులు చెల్లించాల్సిందే నా అంటూ ఆపిల్ సంస్థను ఏకేస్తున్నారు. అయితే ప్రస్తుతానికి చార్జర్  లేకపోతె మరి అందుకు సంబంధించి ఏం చేయాలని చాలా మంది భావిస్తున్నారు.

 ఇందుకు సంబంధించి ఆపిల్ సంస్థ ఇదివరకు మీరు ఐఫోన్ వాడుతున్నట్లయితే అందుకు సంబంధించిన చార్జర్ ని ఐఫోన్ 12 కూడా వినియోగించుకోవచ్చని చెప్పుకొచ్చింది. సరిగ్గా ఇదే అంశాన్ని ప్రపంచవ్యాప్తంగా ఆండ్రాయిడ్ ఫోన్స్  తయారు చేసే కంపెనీలు అనుసరించే ఆలోచనలో ఉన్నట్లు కనబడుతోంది. ఇక ఈ విషయాన్ని బట్టి చూస్తే ఇకముందర ఆండ్రాయిడ్ ఫోన్ కొనుగోలు చేస్తే అందుకు సంబంధించి ఎలాంటి చార్జెస్ రావేమో కాబోలు. ఆపిల్ ఫోన్ తయారీ కంపెనీలగే నిర్ణయం తీసుకో పోతున్నాయి అన్న డౌట్ చాలామందికి వస్తుంది. అలాగే ఫోన్ ధర కూడా తక్కువగా ఉండే విధంగా పరోక్షంగా ఈ నిర్ణయాన్ని ఆపిల్ సంస్థ తీసుకున్నట్లు అర్థమవుతుంది. అయితే ఇందుకు సంబంధించి ఆపిల్ ఐఫోన్ 12ను 90% రీసైకిల్ ఫ్రెండ్లీ ఫైబర్ తో తయారు చేసినట్లు కనబడుతుంది.

అసలు విషయంలోకి వెళితే ఇందుకు ప్రధాన కారణం లేకపోలేదు. ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకీ ఎలక్ట్రానిక్ వేస్ట్ ఎక్కువగా జరుగుతోంది. ప్రతి దేశంలో సంవత్సరం పొడవునా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు బాగానే జరుగుతున్నాయి. ఇది వరకు ఒక మొబైల్ తీసుకుంటే రెండు లేదా మూడు సంవత్సరాల వరకు దానిని ఉపయోగించే వారు కాకపోతే ఇప్పుడు ఒక సంవత్సరం గడిస్తేనే కొత్త మొబైల్ కొనాలి అన్నట్టుగా మనుషులు తయారు అయిపోయారు. దీనితో  ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఎక్కువగా జరుగుతోంది. కాబట్టి ఇలా కూడా ఓ రకంగా ఎలక్ట్రానిక్ వేస్ట్ తగ్గించడానికి ఆపిల్ సంస్థ ముందడుగు వేసింది. ఇక త్వరలో ఆండ్రాయిడ్ ఫోన్లు తయారీ కంపెనీలు కూడా ఇలాగే ఆలోచిస్తే ఆండ్రాయిడ్ ఫోన్ కొన్నప్పుడు కొత్త ఛార్జ్ దొరకక పోవచ్చు. ఇదివరకు ఉన్న మొబైల్స్ ఒక చార్జింగ్ కొత్త మొబైల్స్ కు ఉపయోగించే విధంగా తర్వాత రాబోయే చార్జింగ్ పిన్స్ తయారు చేయబోతున్నారు. కాబట్టి చార్జర్ ఎక్కడ పడితే అక్కడ పాడేసుకోకుండా జాగ్రత్త గా ఉంచుకోవడం మేలు.


మరింత సమాచారం తెలుసుకోండి: