రోజురోజుకి వాట్సాప్ తన యూజర్స్ కోసం ఎన్నో రకాల ఆప్షన్స్ ను అందుబాటులోకి తీసుకొని వస్తోంది. అయితే ఇందుకు సంబంధించి కొత్త ఆప్షన్స్ ని ముందుగా వాట్సాప్ బీటా వెర్షన్ వాడే వినియోగదారులకు మాత్రమే అందిస్తుంది. ఆ తర్వాత వాటిలో ఏవైనా సమస్యలు ఉత్పన్నమైతే వాటిని సరిచేసి అన్ని రకాల వినియోగదారులకు ఈ కొత్త వర్షన్ విడుదల చేస్తుంది. ఇందులో భాగంగానే తాజాగా వాట్సాప్ మరో సరికొత్త ఆప్షన్ బీటా యూజర్స్ కోసం అందుబాటులోకి తీసుకువచ్చింది.


వాట్సాప్ బీటా 2.20.202.8 వర్షన్ వాడుతున్న వినియోగదారులు ఇకమీదట డైరెక్ట్ గా పూర్తి వివరాలను వారికి తెలిసే విధంగా అవకాశాన్ని కల్పించింది. ఇక్కడ ప్రధానంగా గుర్తుపెట్టుకోవలసిన అంశం ఏమిటంటే.. వాట్సప్ అప్లికేషన్ ఎప్పుడైనా క్రాష్ ఇవ్వడం గానీ, ఇతర సాంకేతిక పరమైన ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న సరే అలాంటి సమస్యలను పూర్తిగా డైరెక్ట్ గా వాట్సాప్ సంస్థ కు పంపించే విధంగా ఏర్పాటు చేసింది. ఇది కేవలం ఏదైనా వాట్సప్ సంబంధించి ఫెయిల్యూర్ విషయాలకు సంబంధించి మాత్రమే ఉపయోగించవచ్చు. లేకపోతే ఏదైనా సందేహాలు సంబంధించి మాత్రం దీనిని ఉపయోగించలేరు.

ఇందులో భాగంగా వాట్సప్ అప్లికేషన్ లో కాంటాక్ట్ అనే విభాగంలోకి వెళితే.. అందులో టెల్ అస్ మోర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే అక్కడ ఓ ఖాళీ బాక్స్ కనబడుతుంది. అందులో మీకు ఏదైనా సమస్య గురించి పూర్తి సమాచారం అందించగా.. అలాగే అందుకు సంబంధించి ఏవైనా స్క్రీన్ షాట్స్ ను జతపరచడానికి కూడా ఉపయోగపడేలా కొత్త వర్షన్ ని రిలీజ్ చేయడం జరిగింది. దీంతో వాట్సాప్ సంస్థకి యూజర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో అన్న వాటిపై పూర్తి అవగాహన కల్పించడంతో తర్వాతి వర్షన్ లో సమస్యలను ఉత్పన్నం చేసుకొని కొత్త వర్షన్ రిలీజ్ చేయగలదు.

మరింత సమాచారం తెలుసుకోండి: