ఈ దసరాకి యాపిల్ తమ వినియోగదారులకి భారీ ఆఫర్లని అందిస్తున్న సంగతి తెలిసినదే. ఇది ఇలా ఉండగా అమెరికన్ మల్టీనేషనల్ టెక్ దిగ్గజం యాపిల్ తమ  ఐఫోన్ 12 సిరీస్‌ను లంచ్ చేయడం చూసాం కానీ తీవ్ర విమర్శలు మాత్రం తప్పడం లేదు.  కారణం ఏమిటంటే...?  ఈ ఫోన్లతో కంపెనీ చార్జర్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ అందించకపోవడమే. వేలకు వేలు పోసి కొనుగోలు చేసే ఫోన్‌కు చార్జర్ ఇవ్వకపోవడం ఏంటంటూ కొందరు వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇలా అనేక విమర్శలు కంపెనీ ఎదుర్కొంటోంది. అలానే వినియోగదారులు  చార్జర్ లేని ఫోన్లను కొని ఏం చేసుకోవాలంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా ఇతర కంపెనీలు కూడా  యాపిల్‌ను దారుణంగా ట్రోల్ చేశాయి.

ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లతో ఇవి ఇవ్వడం లేదన్న సంగతి తెలిసినప్పటి నుండి కూడా  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇతర ఆండ్రాయిడ్ కంపెనీలు  ఈ కంపీనీ పై దాడి చేస్తూనే ఉన్నాయి.  ఇది ఇలా ఉండగా యాపిల్ ప్రత్యర్థి శాంసంగ్ అయితే  ఇదే మంచి అవకాశం అన్నట్టు సెటైర్లు మొదలెట్టేసింది. శాంసంగ్  యాపిల్‌ను లక్ష్యంగా చేసుకుని  తాము మాత్రం చార్జర్ ఇస్తామంటూ సోషల్ మీడియా వేదికగా పలు సెటైర్లు వేసింది. ఇలా ట్రోల్ చేసే జాబితాలో చైనీస్ మొబైల్ మేకర్ షియోమీ కూడా చేరడం జరిగింది.

ఇలా  షియోమీ ట్రోల్ చేస్తూ ఒక వీడియో ని షేర్ చేసింది. అది ఇప్పుడు వైరల్ గా మారింది. ఆ వీడియో తో పైన ఈ విధంగా క్యాప్షన్ పెట్టింది షియోమీ. లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ 'ఎంఐ 10టీ ప్రొ'ని కొనుగోలు చేసిన వ్యక్తి అన్‌బాక్సింగ్ చేస్తాడు. అందులో చార్జర్ కూడా కనిపిస్తుంది చింతించొద్దు అని యాపిల్ కంపెనీకి  సెటైర్లు వేసింది. అలానే ఎంఐ 10టి ప్రొ'తో కూడా  మేం విడిచిపెట్టడం లేదు అని చెప్పింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: