ఎనిమిది భారతీయ భాషల్లో దేశీ మొబైల్‌ బ్రౌజర్ ని తీసుకు రావడం జరిగింది. అయితే అసలు ఇది ఏమిటి...? దీని వల్ల ఏం ప్రయోజనం కలుగుతుంది? అని మీరు ఆలోచిస్తున్నారా..? మరి ఇప్పుడే పూర్తి విషయాలు తెలుసుకోండి. సరికొత్తగా తీర్చి దిద్దిన దేశీ మొబైల్‌ బ్రౌజర్‌ 'జియోపేజెస్‌'ను రిలయన్స్‌ జియో ప్రవేశపెట్టడం జరిగింది. అలానే ఈ మొబైల్‌ బ్రౌజర్ లో మరో ఆకట్టుకునే విషయం ఏమిటంటే...? ఎనిమిది భారతీయ భాషల్లో లభ్యమవుతుందని సంస్థ చెప్పడం జరిగింది.



మరో గొప్ప విశేషమేమిటంటే....?  మెరుగైన బ్రౌజింగ్‌ అనుభూతిని ఇవ్వడంతో పాటు డేటా గోప్యతకు పెద్ద పీట వేస్తూ దీన్ని రూపొందించినట్లు తెలుస్తోంది. వేగవంతంగా పేజ్‌ లోడింగ్ , మెరుగ్గా మీడియా స్ట్రీమింగ్, ఎన్‌క్రిప్టెడ్‌ కనెక్షన్‌ మొదలైన ప్రత్యేకతలు ఈ బ్రౌజర్‌ లో ఉన్నాయని వివరించారు. గూగుల్, బింగ్, ఎంఎస్‌ఎన్, యాహూ వంటి సెర్చి ఇంజిన్లను డిఫాల్ట్‌ సెర్చి ఇంజిన్లుగా పెట్టుకునేలా హోమ్‌ స్క్రీన్‌ కూడా పర్సనలైజ్‌ చేసుకోవచ్చు.

గూగుల్‌ ప్లే స్టోర్‌ లో దీన్ని అందుబాటు లోకి తెచ్చినట్లు జియో ప్రతినిధి తెలిపారు. గత వెర్షన్‌ కు 1.4 కోట్ల డౌన్‌ లోడ్స్‌ ఉన్నాయని, వీటన్నింటినీ దశలవారీగా లేటెస్ట్‌ వెర్షన్‌కి అప్‌గ్రేడ్‌ చేయనున్నామని పేర్కొన్నారు. ఇక భాషల విషయానికి వస్తే..... ఇంగ్లీష్ , తెలుగు సహా తమిళం, మలయాళం, కన్నడ , హిందీ, మరాఠీ, గుజరాతీ , బెంగాలీ భాషల్లో జియో పేజెస్‌ అందుబాటు లో ఉంటుందని చెప్పడం జరిగింది. తమకు కావల్సిన కంటెంట్‌ పొందేలా కస్టమైజ్‌ చేసుకునేందుకు కూడా వీలుంటుంది. కాబట్టి  జియో పేజెస్‌ బ్రౌజర్‌ను యూజర్లు వాళ్ళ భాష లో పొందవచ్చు.  'ఇన్ఫర్మేటివ్‌ కార్డ్‌' ఫీచరు ద్వారా వార్తలు, క్రికెట్‌ స్కోర్‌ మొదలైన వాటి గురించి ఎప్పటికప్పుడు విషయాలని కూడా చూడొచ్చు.  

మరింత సమాచారం తెలుసుకోండి: