ప్రముఖ అధ్యయన సంస్థ 'వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరమ్'... ప్రస్తుత  ఉద్యోగ పరిస్థితులపై కరోనా, ఆటోమేషన్ల ప్రభావం గురించి కూలంకషంగా ‌అధ్యయనం చేసింది. అంతేకాకుండా ఈ స్టడీ ద్వారా కొన్ని ముఖ్యమైన అంశాలను వెల్లడించింది. అవేమిటంటే.. ఆటోమేషన్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 15 రంగాల్లో 8.5 కోట్ల ఉద్యోగాలు కనుమరుగయ్యాయని అంచనా వేసింది. అంతేకాకుండా కొత్తగా 9.7 కోట్ల ఉద్యోగాలు రాబోతున్న రంగాలను, వాటిని చేజెక్కించుకోవాలంటే ఉద్యోగార్థులకు అవసరమైన స్కిల్స్‌ను కూడా గుర్తించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ స్పెషలిస్ట్, డేటా అనలిస్ట్ అండ్ సైంటిస్ట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ ఇలా కొత్త రంగాల్లో కొత్త ఉద్యోగావకాశాలు రాబోతున్నట్లు గమనించింది.
సర్వే అంచనా ప్రకారం 2025 నాటికి 50 శాతం ఉద్యోగులు రీస్కిలింగ్‌పై ఆసక్తి చూపిస్తున్నరని తెలిపింది. సుమారు 40 శాతం మంది ఉద్యోగులు రాబోయే ఆరు నెలల్లోపే కొత్త టెక్నాలజీకి సంబంధించిన స్కిల్స్ నేర్చుకొని సిద్ధంగా ఉండాలని భావిస్తున్నట్లు పేర్కొంది. అలాగే భవిష్యత్తులో బాగా డిమాండ్ ఉండబోతున్న 10 స్కిల్స్‌ను గుర్తించింది అవేమిటంటే..

# యాక్టీవ్ లెర్నింగ్ అండ్ లెర్నింగ్ స్ట్రాటజీస్

#అనలిటికల్ థింకింగ్ అండ్ ఇన్నోవేషన్.

# కాంప్లెక్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్

# క్రిటికల్ థింకింగ్ అండ్ అనాలిసిస్

# క్రియేటివిటీ, ఒరిజినాలిటీ అండ్ ఇనీషియేటీవ్

# లీడర్‌షిప్ అండ్ సోషల్ ఇన్‌ఫ్ల్యూయెన్స్

# రిజైలియన్స్, స్ట్రెస్ టాలరెన్స్ అండ్ ఫ్లెక్సిబిలిటీ

# రీజనింగ్, ప్లాబ్లమ్ సాల్వింగ్ అండ్ ఐడియేషన్

# టెక్నాలజీ యూజ్, మానిటరింగ్ అండ్ కంట్రోల్

# టెక్నాలజీ డిజైన్ అండ్ ప్రోగ్రామింగ్

ఈ పది రకాల నైపుణ్య లక్షణాలు ఉన్న నిరుద్యోగ యువతకు రానున్న రోజుల్లో తిరుగే ఉండదని, వారి జీతభత్యాలు ఆకాశం అంటే రేంజ్లో అద్భుతంగా ఉంటాయని అంచనా వేసింది. కావున నిరుద్యోగ యువత అంతా అనవసర ఆలోచనలు, పనులు మాని ఈ పది రకాల నైపుణ్య లక్షణాలు అభివృద్ధి చేసుకోవడం ద్వారా మంచి  బంగారు భవిష్యత్తు సొంతం చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: