ఒప్పో సరికొత్త ఫోన్ ని తీసుకు వస్తోంది. ఈ ఫోన్ కి సంబంధించి పలు వివరాలు లీక్ అయ్యాయి.  ఈ ఫోన్ మొదట ఇండోనేషియా లో లాంచ్ చేశారు. ఒప్పో ఏ33 ధర, ఫీచర్స్ వివరాలు ఇవే...! ఇక ఆలస్యం ఎందుకు చూసేయండి. ఒప్పో ఏ ౩౩ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 460 ప్రాసెసర్‌ పై ఈ ఫోన్ పని చేయనుంది. ఆండ్రాయిడ్ 10 ఆధారిత కలర్ ఓఎస్  7.2 ఆపరేటింగ్ సిస్టం పై ఈ ఫోన్ తో అందించారు. అలానే బ్యాటరీ సామర్ధ్యం వచ్చేసి 5000 ఎంఏహెచ్ గా ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్ గా ఉంది.



ఇందులో హోల్ పంచ్ డిస్ ప్లేను అందించారు. ఈ కెమెరా విషయానికి వస్తే..... ఫోన్ వెనక వైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్‌గా ఉండనుంది. దీంతో పాటు 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ , 2 మెగా పిక్సెల్ మాక్రో షూటర్‌లు కూడా ఉన్నాయి. ఇక సెల్ఫీ కెమెరా అయితే  8 మెగా పిక్సెల్ ఉంది.  అలానే ఇందు లో వెనక వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. బ్లూటూత్ వీ5, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, వైఫై కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు.

విడుదలైన  పోస్టర్ ప్రకారం ఒప్పో ఏ33 (2020) ధర రూ.11,990 గా ఉంది. స్టోరేజ్ విషయానికి వస్తే....3 జీబీ ర్యామ్ + 32 జీబీ స్టోరేజ్ వేరియంట్‌తో ఈ ఫోన్ లాంచ్ చేశారు. దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు  కోటక్ బ్యాంక్, ఆర్బీఎల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఫెడరల్ బ్యాంక్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్ బ్యాక్ లభిస్తుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: