మొబైల్ అంటే ప్రస్తుత కాలంలో ఇష్టపడని వాళ్ళు ఉండరేమో.. పాలు తాగే పిల్లగాడు నుంచి ముసాలాడి వరకు మొబైల్ కు అతుక్కుపోయి ఉంటారు.. అయితే మొబైల్ ప్రియులను ఆకర్షించడానికి కంపెనీలు కొత్త ఫోన్లను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.. ప్రజల అభిప్రాయాలను, రుచులకు తగ్గట్లు మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా కొత్త మొబైల్ ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం దసరా ,దీపావళి పండుగ రాబోతున్న సందర్భంగా అదిరిపోయే ఆఫర్ల తో మార్కెట్ లోకి కొత్త ఫోన్లు దర్శనమిస్తున్నాయి..


ఈ నేపథ్యంలో మొబైల్ కంపెనీలలో ప్రముఖ కంపెనీ సామ్ సంగ్ కొత్త ఫీచర్లు కలిగిన ఫోన్ ను విడుదల చేసింది. గతంలో వచ్చిన ఫీచర్లకు ఈ ఫోన్ కు వచ్చిన ఫీచర్ల కు గల వ్యత్యాసాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఆ ఫోనే సామ్ సంగ్ గెలాక్సీ F14  గత వారం బిగ్ బిలియన్ డేస్ లో ఈ ఫోన్ లాంఛ్ అయ్యింది. ధర కేవలం రూ . 15, 499 మాత్రం .. ఇక ఈ ఫోన్ ప్రత్యేకతలను పరిశీలించినట్లయితే.. 6 gb ram, 64 gb ఇంటర్నల్ మెమరీ ఉంటుంది..నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ అయ్యే 6000 mAh బ్యాటరీ ఫ్యాకప్ ఉంది.


ట్రిపుల్ కెమెరా సెటప్ చాలా బాగుంది, ఇది మీకు మంచి ఫోటోలను తీసుకోవడానికి ఇంకొక ఫోటోగ్రఫీ గాడ్జెట్ అవసరం లేకుండా చేస్తుంది. 64MP ప్రధాన కెమెరా ప్రతిదీ ఎంతో క్లారిటీతో కాప్చర్ చేస్తుంది. ఇక 8MP కెమరా అయితే ఫుల్ ఫ్యామిలీని కవర్ చేస్తుంది.32MP ఫ్రంట్ కెమెరాతో మీ ఫోటోలను అందంగా మార్చుకోవచ్చు. ఇవన్నీ కాకుండా, ఇందులో ఉన్న సింగిల్ టెక్ ఫీచర్ సహాయంతో ఒకే క్లిక్‌తో 10 రకాల అవుట్‌పుట్స్ పొందవచ్చు, ఇది మిమ్మల్ని సోషల్ మీడియా గేమ్‌లో టాప్‌లో ఉంచుతుంది. ఇంతగా వాడిన ఫోన్ హ్యాంగ్ అవ్వదు.. ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ లో మాత్రమే దొరుకుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: