కాలం మారింది.. మనుషుల అభిరుచులు, ఆలోచనలు కూడా పూర్తిగా మారుతున్నాయి. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని కొత్త కొత్త కంపెనీలు కొత్త వస్తువులను మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు.. అందుకే ఇప్పుడు అంతా టెక్నాలజీ మీద ఆధారపడి బ్రతుకుతున్నారు.. అన్నిటితో పోలిస్తే ఫోన్లు మాత్రం మాములుగా లేవు.. ఈ కంపెనీ లో మంచిగా ఉన్నాయి అనుకునే లోపు మరో కంపెనీ మరో కొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకువస్తుంది.. ఈ మధ్య కాలంలో మొబైల్ కంపెనీలు కొత్త మొబైల్ లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు.



ప్రస్తుతం దసరా, దీపావళి పండుగలకు మెగా ఆఫర్ల తో అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నారు. తాజాగా మరో కొత్త ఫీచర్లతో , కొత్త టెక్నాలజీ ఉన్న ఫోన్ మార్కెట్ లో దూసుకుపోతుంది. అదే హువావే .. ఈ ప్రత్యేకతల విషయానికొస్తే..కెమెరా సెటప్, హోల్ పంచ్ కెమెరా డిజైన్‌తో లాంచ్ అయింది. హువావే కిరిన్ 9000ఈ ప్రాసెసర్‌ను ఈ ఫోన్లల లో ఉంచారు. ఈ ఫోనే అంతగా ఫేమస్ అవ్వడానికి కారణం 50 మెగా పిక్సెల్ కెమెరా ఉండటమే..మొదటగా ఈ ఫోన్ ను యూరఫ్ లో లాంఛ్ చేశారు..అక్కడ ధర వచ్చి 899 యురోలుగా పలికింది. అంటే మన లెక్కలో చెప్పాలంటే రూ. 78,000..



బ్లాక్, గ్రీన్, మిస్టిక్ సిల్వర్, వైట్, ఎల్లో కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉండనుంది. ఇక స్టోరేజ్ విషయానికొస్తే..8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వరకు ఉంటుంది. వెనుక వైపు మూడు కెమెరాలు..16 mp, 13mp , 8 mp ఉండగా, ముందు వైపు 50 mp కెమరా ఉండటంతో ఈ ఫోన్ కు డిమాండ్ భారీగా పెరిగింది.ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఈఎంయూఐ 11.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.. బ్యాటరీ ఫ్యాకప్ కూడా బాగా ఉంది. 188 గ్రాముల బరువును కలిగి ఉంది. ఎటూ చూసుకున్న కూడా మొబైల్ ప్రియులకు ఈ ఫోన్ కన్నుల పండుగ అని చెప్పాలి..


మరింత సమాచారం తెలుసుకోండి: