మీరు కొత్త ఫోన్ తీసుకోవాలి అనుకుంటున్నారా. అయితే ఇది మీకు గుడ్ అనే చెప్పాలి మరి. ఈ పండగ సీజన్లో ఈ కార్ట్ సంస్థలు అదిరిపోయే ఆఫర్లను అందిస్తున్నాయి. తాజాగా ఒప్పో ఫోన్ నుండి సరికొత్త ఫీచర్లతో ఇటీవల ఇండియాలో ఒప్పో F17 ప్రో యొక్క దివాళీ ఎడిషన్ ను కూడా లాంచ్ చేసింది. ఈ ఒప్పో F17 ప్రోలో అదిరిపోయే ఫీచర్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ ని ప్రత్యేకమైన దివాళీ బాక్స్ తో అఫర్ చేస్తున్నట్లు ఒప్పో వెల్లడించింది. అంతేకాదు ఈ ఫోన్ బ్యాక్ కవర్ బంగారు, ఆక్వా గ్రేడియంట్ మాట్టే ఫినిషింగ్ తో ఉంది. ఇక ఈ ఫోన్ సేల్స్ అక్టోబర్ 23 నుండి అమెజాన్, ఫ్లిప్ కార్ట్, ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో ప్రారంభమైయ్యాయి. ఇక ఈ ఫోన్ తో పాటు 10,000 ఒప్పో పవర్ బ్యాంక్ ఉచితంగా అఫర్ చేస్తున్నట్లు వెల్లడించారు.

ఇక ఒప్పో F17 ప్రో ఫోన్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఈ ఫోన్ సన్నగా ఉండి తేలికపాటి డిజైన్‌ తో కేవలం 7.48 మందంతో 164 గ్రాముల బరువును కలిగి ఉంటుంది. ఇక ఈ ఫోన్ ఒక 6.4-అంగుళాల FHD + (2400 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ AMOLED స్క్రీన్‌ ను కలిగి ఉంటుంది. ఇక కెమెరా విషయానికి వస్తే.. ఫోన్ ముందు భాగంలో రెండు సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ముందు వైపు కెమెరాలో 16MP ప్రాధమిక సెల్ఫీ కెమెరా, 2MP డెప్త్ సెన్సార్ ఉన్నాయి. ఒప్పో ఎఫ్ 17 ప్రో వెనుక భాగంలో క్వాడ్-కెమెరా సెటప్ ‌తో వస్తుంది. ఇక వెనక కెమెరాలో 48 mp ప్రాధమిక కెమెరా, 8 mp అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, 2 mp మాక్రో కెమెరా, 2 mp డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. వెనుక కెమెరాలు 30FPS వద్ద 4K UHD వరకు రికార్డ్ చేయగలవు. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4,000mAh ఉంటుంది.

ఇక ఈ ఫోన్ కి సంబంధించిన బ్యాంకుల విషయానికి వస్తే బ్యాంక్ ఆఫ్ బరోడా, RBL బ్యాంక్ క్రెడిట్ కార్డుతో EMI ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 10% తక్షణ డిస్కౌంట్ లభించనుంది. ఇక ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ క్రెడిట్ కార్డుతో EMI ద్వారా ఈ ఫోన్ కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ అఫర్ వుంది. ఇక Axis, కోటక్ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుతో కొనేవారికి 10% క్యాష్ బ్యాక్ అఫర్ లను అందించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: