మనకు ఒక ఫోన్ ఉంటే ప్రపంచమే శూన్యం అవుతుంది. అది నిజమే.. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ అంటే ప్రపంచం మొత్తం అర చేతిలో కనిపిస్తుంది. యువత ముఖ్యంగా ఈ ఫోన్లను 24 గంటలు అంటి పెట్టుకొని ఉంటారు. ఇక యువత ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు కంపెనీ యాజమాన్యాలు.. రోజుకో కొత్త ఫోన్ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా దిగ్గజ కంపెనీలు అయితే మరీ ఎక్కువ.. కొత్త టెక్నాలజీ ఉన్న ఫోన్లను మార్కెట్ లోకి వదలడానికి ముందున్నారు.



తాజాగా ప్రముఖ మొబైల్ కంపెనీ ఎల్జీ మరో కొత్త ఫీచర్లతో కొత్త ఫోన్ ను విడుదల చేసింది. ఎల్జీ వింగ్ స్మార్ట్ ఫోన్ ఎట్టకేలకు మనదేశంలో లాంచ్ అయింది.. డ్యూయల్ స్క్రీన్ ను ఇందులో ఉంచారు. దీంతో పాటుగా ఫోన్ 90 డీగ్రి లో తిరుగుతుంది. రెండు స్క్రీన్ లను ఒకే సారి ఉపయోగించేందుకు ప్రత్యేక సాఫ్టు వేర్ కూడా ఇందులో ఉంది. ఈ ఫోన్ మొట్టమొదట గా దక్షణ కొరియాలో లాంఛ్ అయ్యింది.128 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.69,990గా నిర్ణయించారు. అరోరా గ్రే, ఇల్యూషన్ స్కై రంగుల్లో ఈ ఫోన్ అయింది. ఈ ఫోన్ సేల్స్ మన దేశంలో నవంబర్ 9 నుంచి ప్రారంభం అవుతుందని అంటున్నారు..



ఫోన్ స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. 6.8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ- పీ-ఓఎల్ఈడీ ఫుల్ విజన్ ప్యానెల్‌ను ప్రధాన డిస్ ప్లేగా అందించగా, 3.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ- జీ-ఓఎల్ఈడీ ప్యానెల్‌ను రెండో డిస్‌ప్లేగా అందించారు. .8 అంగుళాల ఫుల్ హెచ్‌డీ- పీ-ఓఎల్ఈడీ ఫుల్ విజన్ ప్యానెల్‌ను ప్రధాన డిస్ ప్లేగా అందించగా, 3.9 అంగుళాల ఫుల్ హెచ్‌డీ- జీ-ఓఎల్ఈడీ ప్యానెల్‌ను రెండో డిస్‌ప్లేగా అందించారు. యువత కోరుకొనే విధంగా ఈ ఫోన్ లో అన్నీ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఫోన్ కోసం మొబైల్ ప్రియులు అప్పుడే బుకింగ్ ను కూడా మొదలు పెట్టారు..

మరింత సమాచారం తెలుసుకోండి: