తను వాడే ఫోన్ లో అన్నీ రకాల ఫీచర్లు ఉండాలని అనుకుంటారు.. అయితే మార్కెట్లకు రోజుకో ఫోన్ అందుబాటులోకి వస్తున్నాయి.. ఈ మేరకు కొత్త ఫోన్ లో రోజుకొకటి మార్కెట్ లోకి దర్శనమిస్తుంది.. దీంతో ఏ ఫోన్ కొనాలో తెలియక అన్నీ ఫోన్లని తెగ వాడేస్తున్నారు.. ఇక మొబైల్ ప్రియుల ఆలోచనలకు తగ్గట్లు కంపెనీలు కూడా వ్యవహరిస్తున్నారు. అయితే వేలకు వేలు పెట్టుకోవడం కన్నా ఒక ఫోన్ లో అన్నీ  ఉండాలని కోరుకుంటున్నారు...




అలాంటి వారికి ఊరించే ఒక శుభవార్త.. ఎల్జీ కొత్త ఫీచర్స్ తో తక్కువ ధరలో ఉన్న కొత్త ఫోన్ ను అందుబాటు లోకి తీసుకొచ్చింది. ఆ ఫోన్ యొక్క ప్రత్యేకతలు అంతగా పాపులర్ అవ్వడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..ఎల్జీ మరో 5జీ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. అదే ఎల్జీ కే92 5జీ. ఎల్జీ తక్కువ ధరలోనే లాంచ్ చేసిన 5జీ ఫోన్ ఇదే. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 690 ప్రాసెసర్‌ పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కూడా ఇందులో అందించారు.




ఫోన్ లో వెనుక నాలుగు కెమెరాలు ఉండగా అందులో ఒకటి 64 మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది.ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇండియాలో ఈ ఫోన్ ధర కేవలం 26,600 మాత్రమే.. 5జీ, వైఫై, బ్లూటూత్ 5.1, ఎన్ఎఫ్‌సీ, యూఎస్ బీ టైప్- సీ వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఫోన్ పక్క భాగంలో అందించారు.. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. మొత్తానికి ఈ ఫోన్ ఫీచర్లు అదిరిపోవడం తో పాటుగా ఫోన్ పీస్ ఆకట్టుకుంటుంది.  దీంతో ఫోన్ కు మార్కెట్ లో డిమాండ్ కూడా పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: