ప్రపంచ వ్యాప్తంగా తెగ పాపులర్ అయిన మొబైల్ గేమ్ పబ్‌జీ. ప్లేయర్ అన్‌నౌన్స్ బ్యాటిల్ గ్రౌండ్.. దీన్నే షార్ట్ ఫామ్‌లో పబ్‌జీ అంటారు. ఇది కుర్రకారులో ఎంత పాపులర్ అయిందంటే.. ఈ గేమ్ ఆడుతూ ఆహారం తీసుకోవడం కూడా మర్చిపోతున్నారు. పెళ్లిల్లు కూడా ఆగిపోతున్నాయి. ఇంతలా ప్రజల జీవితాలతో పెనవేసుకుపోయిన ఈ గేమ్‌ను సడెన్‌గా భారత ప్రభుత్వం నిషేధించింది. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రజల డేటాను డ్రాగన్ కంట్రీ దొంగిలించే అవకాశం ఉందని భారత ప్రభుత్వం భావించింది.

అందుకే చైనాకు చెందిన చాలా యాప్‌లు, గేమ్‌లు నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. వాటిలో పబ్‌జీ కూడా ఉండటంతో ఈ గేమ్ అభిమానులకు గుండె ఆగినంత పనయ్యింది. ఈ క్రమంలో పరిస్థితిని అంచనా వేసిన పబ్‌జీ సృష్టించిన కొరియన్ కంపెనీ క్రాఫ్టాన్ ఇన్‌కార్పొరేషన్.. తన భాగస్వామి అయిన చైనీస్ కంపెనీ టెన్సెంట్‌తో బంధాలు తెంచుకుంది. భారత్ ప్లేయర్స్ డేటా భద్రత విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటామని ప్రకటించింది. దీనికోసం మైక్రాసాఫ్ట్ అజూర్ సంస్థతో ఒప్పందం చేసుకుంది. ఇలా చేయడం ద్వారా భారతీయుల డేటా భద్రతపై ఎటువంటి సందేహాలకూ ఆస్కారం లేకుండా చేయడమే క్రాఫ్టాన్ ప్లాన్.

దీంతో పబ్జీని భారత్‌లో తిరిగి విడుదల చేయడానికి దాదాపు అన్ని అడ్డంకులూ తొలగిపోయాయి. ఈ క్రమంలోనే పబ్జీ అభిమానులకు క్రాఫ్టాన్ కంపెనీ ఓ సర్‌ప్రయిజ్ ఇచ్చింది. తమ అధికారిక వెబ్‌సైట్లో డౌన్‌లోడ్ లింక్స్ పెట్టింది. వాటిని చూసిన పబ్జీ ప్రియులు వెర్రెత్తిపోయారు. వెంటనే వాటిని నొక్కేసి గేమ్ డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించారు. అయితే ఈ లింకులు పనిచేయడం లేదు. త్వరలోనే భారతీయులకు ఈ గేమ్ అందుబాటులోకి వస్తుందని చెప్పడానికే క్రాఫ్టాన్.. ఈ లింకులు పెట్టినట్లు సమాచారం.

ఇది వరకే పబ్జీ ఇండియా వెర్షన్‌కు సంబంధించిన ఓ టీజర్ విడుదలైంది. భవిష్యత్తులో ఓ ట్రైలర్ కూడా విడుదల చేయడానికి క్రాఫ్టాన్ సన్నాహాలు చేస్తోందట. అంతే కాదండోయ్.. ఈ గేమ్‌ను మరీ ఎక్కువ సేపు ఆడకుండా టైం రిస్ట్రిక్షన్స్‌ కూడా పెట్టాలని ఆలోచిస్తోందట క్రాఫ్టాన్. ఇదే జరిగితే తిండి, నీళ్లు మానేసి రోజుల తరబడి గేమ్ ఆడేవాళ్లు ఇకపై అలా చేయడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: