ప్రస్తుతం ఈ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ ఉంటుంది.. పండగ సీజన్ కనుక కొత్త ఫోన్లు మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి.. ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రో మ్యాక్స్.. మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది..ఇప్పటికే ఈ కంపెనీ నుంచి వచ్చిన ఫోన్లు ఇప్పుడు మార్కెట్ లో సందడి చేస్తున్నాయి.ఫీచర్లు ఎక్కువగా ఆకట్టుకోవడం తో కొత్త ఫోన్లను కంపెనీ అందుబాటులోకి తీసుకొస్తుంది.. ఇప్పుడు కూడా మార్కెట్ లోకి వచ్చిన ఫోన్ కూడా ఫీచర్లు అదిరిపోతున్నాయి.. ముఖ్యంగా చెప్పాలంటే ధర తక్కువ కావడంతో ఫోన్ కొనుగోలు కాస్త ఎక్కువగా జరుగుతున్నాయి..



ఫోన్ ప్రత్యేకతలు విషయానికొస్తే... ఈ ఫోన్ ఇన్ సిరీస్‌లో ఇన్ నోట్ 1ఏ, ఇన్ 1బీ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. వీటిలో మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1కు సంబంధించిన సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్ కార్ట్‌లో ఈ సేల్ ప్రారంభం కానుంది. ఈ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ ప్రాసెసర్‌తో లాంచ్ అయింది..ఇకపోతే ఈ ఫోన్ లో 4 ప్రధాన కెమెరాలు ఉన్నాయి.అందులో ఒకటి 48 మెగా పిక్సెల్ కెమెరా. 



4 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. గ్రీన్, వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. చైనా బ్రాండ్లకు ఈ ఫోన్ గట్టి పోటీ ఇస్తుంది..సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది.ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టంపై ఈ స్మార్ట్‌ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5,000 ఎంఏహెచ్ కాగా, 18W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీని ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.ఆక్టా కోర్ మీడియాటెక్ హీలియో జీ85 ప్రాసెసర్ పై మైక్రోమ్యాక్స్ ఇన్ నోట్ 1 పనిచేయనుంది.. మొత్తానికి ఈ సరికొత్త ఫోన్ సరసమైన ధరలతో పాటుగా ఆకర్షణీయమైన రంగును కూడా కలిగి ఉంటుంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: