ప్రస్తుతం కరోనా కాలంలో డబ్బల వాడకం సాధ్యమైనంత తగ్గించడానికి అందరూ ప్రయత్నిస్తున్నారు. ఆన్ లైన్ పేమెంట్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఈ క్రమంలో ఫోన్ పే, గూగుల్ పే, పేటీయం తదితర పేమెంట్ యాప్స్ విపరీతంగా పుంజుకున్నాయి. వీటిలో గూగుల్ పే యూజర్లు రోజు రోజుకూ పెరిగిపోతూ ఉన్నారు. ఇలాంటి సమయంలో గూగుల్ పే నుంచి యూజర్లకు ఓ షాకింగ్ వార్త తెలిసింది. అదేంటంటే.. ఇకపై గూగుల్ పే ద్వారా చెల్లింపులు చేస్తే మనకు చార్జీలు పడతాయట. ఈ వార్త భారతీయ మార్కెట్లో దావానలంలా వ్యాపించింది.

చాలామంది గూగుల్ పే యూజర్లు తమ ఫోన్ లోని యాప్ ను డిలీట్ చేసేద్దామా? అని ఆలోచించారు. దీంతో తమ మార్కెట్ దెబ్బ తింటోందని గూగుల్ పే గమనించింది. వెంటనే రంగంలోకి దిగి యూజర్లకు వివరణ ఇచ్చింది. గూగుల్ పే యూజర్లపై చార్జీలు విధిస్తున్నట్లు వచ్చిన వార్తలు వాస్తవమే అని సదరు సంస్థ అంగీకరించింది. అయితే ఈ చార్జీలతో భారతీయ యూజర్లకు అసలు ఎటువంటి సంబంధమూ లేదని తేల్చి చెప్పింది. ఈ చార్జీలు అమెరికాలో మాత్రమే విధిస్తామని స్పష్టం చేసింది.

‘‘గూగుల్ పే ట్రాన్సాక్షన్‌ లపై చార్జీలు విధించేది కేవలం అమెరికాలోనే భారత్ లో ఈ నిర్ణయం అమలు కాదు’’ అని గూగుల్ పే వివరణ ఇచ్చింది. ఈ మాటలు విన్న యూజర్లు ఊపిరి పీల్చుకున్నారు. అలాగే ఈ సందర్భంగా గూగుల్ పే మరో విషయం కూడా వెల్లడించింది. 2021 నుంచి గూగుల్ పే సరికొత్త లుక్‌లో కనపడుతుందని, ఈ కొత్త డిజైన్ కచ్చితంగా యూజర్లక నచ్చుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. మరి ఈ కొత్త డిజైన్ ఎలా ఉంటుందో మనకు తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి గూగుల్ పే యూజర్లను భయపెట్టిన చార్జీల విషయంలో క్లారిటీ రావడం మాత్రం వినియోగ దారులకు ఊరట ఇచ్చిందనే చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: