అమెజాన్.. ఈ పేరు తెలియని వారుండటం చాలా అరుదు. ఎందుకంటే ప్రస్తుత మోడ్రన్ యుగంలో మనకు కావలసిన వస్తువులన్నీ ఆన్‌ లైన్‌ లోనే కొనేసు కుంటున్నాం. ఇలాంటి సమయంలో మన అవసరాలు అన్నీ తీరుస్తున్న ప్లాట్‌ఫామ్ అమెజాన్. బైక్స్ నుంచి బోల్టుల వరకూ అన్నీ మనకు అమెజాన్‌లో దొరుకుతాయి. ఈ కారణంగానే ప్రపంచ వ్యాప్తంగా ఈ యాప్ ఉపయోగించే వారు చాలామంది ఉన్నారు. దీంతో ప్రపంచంలో నెంబర్ వన్ ఈ-కామర్స్ వెబ్‌ సైట్‌గా అమెజాన్ నిలిచింది.

 అయితే భారత్ మాత్రం దీన్ని రీప్లేస్ చేసే యోచనలో ఉందట. ఇటీవల భద్రత కారణంగా చాలా చైనీస్ యాప్‌లను బ్యాన్ చేసిన భారత్.. ఇప్పుడు అమెజాన్‌పై దృష్టి పెట్టిందా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. త్వరలోనే ప్రభుత్వం నుంచి అమెజాన్ వంటి ఓ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ విడుదల అవబోతోందట. దీనిలో కూడా అమెజాన్‌లో లాగానే అన్ని వస్తువులూ లభిస్తాయని సమాచారం.

ఈ ప్లాట్‌ ఫామ్ ఏర్పాటు కోసం చర్చించేందుకు ఓ కమిటీని నియమించిందట భారత ప్రభుత్వం. యాప్ ఎప్పుడొస్తుంది? వంటి కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇంకా తెలీదు. అయితే దీని కోసం ఏర్పాటు చేసిన కమిటీలో మాత్రం 11 మంది సీనియర్ అధికారులు ఉంటారట. వీరే ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ గురించి చర్చించి, ఓ నిర్ణయానికి వస్తారని తెలుస్తోంది. గతంలో అమెజాన్‌కు పోటీగా భారత్‌కు చెందిన ఫ్లిప్ కార్ట్ మార్కెట్‌లో ఉండేది.

అయితే ఇది కూడా తర్వాతి కాలంలో అమెరికాకు చెందిన అగ్ర కంపెనీ వాల్‌మార్ట్‌లో కలిసిపోయింది. దీంతో భారత్‌కు ప్రత్యేకంగా ఉన్న ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్స్ లేవు. ఒక వేళ ఉన్నా అవి చాలా చిన్నవి కావడంతో పెద్దగా పాపులర్ అవ్వలేదు. అందుకే ఈ పరిస్థితిని మార్చడం కోసమే ప్రభుత్వం స్వయంగా ముందడుగు వేసి అమెజాన్ వంటి భారీ ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ ఏర్పాటు చేయాలని చూస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: