నోకియా లో ఇప్పటివరకు కేవలం ఫోన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి.. కానీ ఇప్పుడు మాత్రం కొత్త టెక్నాలజీ తో ల్యాప్ టాప్స్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. సరికొత్త డిజైన్ , కలర్ తో పాటుగా వివిధ రకాల కోర్ ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది.ఈ ల్యాప్ మార్కెట్ లోకి ఇంకా విడుదల కాలేదు కానీ నోకియాకు ఉన్న క్రేజ్ వల్ల ఇప్పటి నుంచే భారీ డిమాండ్ ను అందుకున్నాయి.ఇకపోతే కొత్తగా రానున్న ఈ కంప్యూటర్ల ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..



పర్సనల్ కంప్యూటర్లు, మినీ ల్యాప్‌టాప్‌లను తీసుకొచ్చింది నోకియా. కానీ తర్వాత మార్కెట్ లో పోటీ దృష్ట్యా తిరోగమనాన్ని చూసింది. నోకియా బ్రాండ్ నుంచి వచ్చిన చివరి మినీ ల్యాప్‌టాప్ నోకియా బుక్‌లెట్ 3జీ ఇది 2009లో వచ్చింది. ఇప్పుడు తాజాగా భారతదేశంలో కొత్త సిరీస్ ల్యాప్‌టాప్‌లను విడుదల చేయనున్నట్లు మార్కెట్ లో వార్తలు గుప్పుమన్నాయి.నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండి గ్లోబల్ సంస్థకు చెందిన ల్యాప్‌టాప్‌లు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వెబ్‌సైట్‌లో ప్రత్యేక గుర్తింపు కోసం అభ్యర్థన కోసం ఆఫ్లికేషన్ ను పెట్టుకున్నట్లు తెలుస్తుంది..



కాగా, ఈ కొత్త ల్యాప్ టాప్ లో కొత్తగా 10 సీరీస్ తో మొదలవ్వ డంతో విండోస్ 10 ఆధారంగా పనిచేస్తాయని అర్థమవుతుంది..మోడల్ నంబర్లలో మొదటి రెండు అక్షరాలైన ఎన్ కేలు- నోకియా బ్రాండ్‌ను సూచిస్తున్నాయి. తరువాతి అక్షరాలైన ఐ5, ఐ3లు ప్రాసెసర్‌ను సూచిస్తున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం ఈ కంపెనీ ల్యాప్ టాప్స్ ను చైనాకు చెందిన ప్రముఖ కంపెనీ తయారు చేస్తుంది.నోకియా ఈ ల్యాప్‌టాప్‌లను భారతదేశంలో విడుదల చేయడంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా చేయలేదు.. అయితే మొత్తానికి ఈ కంపెనీకి ఉన్న పేరుతో ఇప్పుడు ల్యాప్ రావడంతో యువత అప్పుడే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. చూద్దాం ఎప్పుడు మార్కెట్ లోకి వస్తాయి ఎలా ఉంటాయో అని..

మరింత సమాచారం తెలుసుకోండి: