యూత్ ప్రస్తుతం బుక్స్ ను పట్టుకోవడం కంటే ఫోన్ పట్టుకోవడం ఎక్కువ.. అందుకే యువతను ఆకట్టుకోవడానికి మొబైల్ కంపెనీ వాళ్ళు కూడా అధ్బుతమైన ఫీచర్స్ తో పాటుగా అదిరిపోయే ధరతో కొత్త టెక్నాలజీ ఉన్న ఫోన్లను మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ఈ ఫోన్స్ ప్రముఖ కంపెనీల నుంచి విడుదల చేస్తున్నారు. ఒకరిని మించి మరొకరు మార్కెట్ లోకి కొత్త ఫోన్లను విడుదల చేస్తున్నారు.. మొబైల్స్ లో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకున్నారు వన్ ప్లస్ మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి తీసుకురానుంది.. ఆ ఫోన్ పై డిమాండ్ భారీగా పెరుగుతున్నాయి.  ఆ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..



వన్ ప్లస్ తన కొత్త ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ సిరీస్‌ను రూపొందిస్తుందని, అది వన్ ప్లస్ 9 సిరీస్ అన్న సంగతి మనకు తెలుసు. కానీ ఇప్పుడు ఈ సిరీస్‌లో వన్ ప్లస్ 9, వన్ ప్లస్ 9 ప్రోతో పాటు మరో స్మార్ట్ ఫోన్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. వన్ ప్లస్ 9ఈ అనే కొత్త స్మార్ట్ ఫోన్ కూడా వన్ ప్లస్ 9 సిరీస్‌లో లాంచ్ కానుందని సమాచారం.మాక్స్ జాంబర్ అనే ప్రముఖ టిప్ స్టర్ ఈ విషయాన్ని బయట పెట్టారు.. వన్ ప్లస్ ఫోన్లు అన్నీ కూడా శాంసంగ్ ఫోన్లకు పోటీనివ్వాలని ఈ కొత్త ఫోన్ ను లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.



వన్ ప్లస్ ఇప్పటికే నార్డ్ సిరీస్ ద్వారా బడ్జెట్ ధరలోనే ఫ్లాగ్ షిప్ ఫీచర్లు అందిస్తోంది. అయితే వన్ పస్ల్ 9ఈ ఒకవేళ లాంచ్ అయితే దాని ధర ఏ రేంజ్‌లో ఉంటుందో కూడా ఇంతవరకు తెలియలేదు.. ఇది కేవలం ఆన్ లైన్ లో వస్తున్న వార్త మాత్రమే..ఈ ఫీచర్స్ ఉన్నాయో.. లేక మరేదైనా కొత్త టెక్నాలజీ ఉందో అనే అంశం మాత్రం ఇక్కడ తెలియరాలేదు.. వన్ ప్లస్ 9 ప్రోలో 6.7 అంగుళాల కర్వ్‌డ్ డిస్ ప్లేను అందించనున్నారు...875 డ్రాగన్ ప్రాసేసర్ తో ఈ ఫోన్ మార్కెట్ లోకి విడుదల కానుంది.. సెల్ఫి ప్రియులకు ఈ ఫోన్ మంచి సంతోషాన్ని కలిగిస్తోంది.. ఇక ఎన్నెన్ని స్పెషల్ ఫీచర్స్ , ధర ఉందో తెలియాలంటే వన్ ప్లస్ కంపెనీ ఈ ఫోన్ గురించి అధికారికంగా ప్రకటించాల్సి ఉంది..


 

మరింత సమాచారం తెలుసుకోండి: