ప్రముఖ మొబైల్ కంపెనీ వివో మరిన్ని ఫీచర్లను యాడ్ చేసి మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది.. వివో వై51.. ఈ ఫోన్ ను త్వరలోనే లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఆ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..ఈ ఫోన్ ధర కూడా లీకైంది. ఇందులో వెనకవైపు 48 మెగాపిక్సెల్ కెమెరా, క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్ ఉండనున్నాయి. అమోఎల్ఈడీ డిస్ ప్లే కూడా ఈ ఫోన్ కలిగి ఉంది. ఇకపోతే వివో ఫోన్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉండటంతో ఇప్పుడు లాంఛ్ కానున్న ఫోన్ పై కంపెనీ ఆశలను పెట్టుకుంది. 



ఫోన్ ధర రూ.20 వేల లోపే ఉండే అవకాశం ఉంది. పాకిస్తాన్‌లో ఈ ఫోన్ ధర రూ.16 వేల రేంజ్‌లోనే ఉంది. అయితే ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుందో అని కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు..ఈ ఫోన్ ప్రత్యేకతలను , ధరను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.ఈ ఫోన్ ధర లాంఛ్ అయినప్పటికీ 19,900 ఉందనుందని తెలుస్తుంది.డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను ఇందులో అందించారు. ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 4 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ను ఇందులో అందించారు. మైక్రో ఎస్ డీ కార్డు ద్వారా స్టోరేజ్ ను 256 జీబీ వరకు స్టోరేజ్ ను పెంచుకొనే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.



సెల్పీ కోసం ఈ ఫోన్ చక్కగా ఉపయోగ పడుతుంది..ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2 మెగా పిక్సెల్ పొర్ ట్రెయిట్ సెన్సార్ కూడా అందించారు. ఇక ఫ్రంట్ సైడ్ మాత్రం ఈ ఫోన్ కు 16 మెగా పిక్సెల్ ఉంటుంది.ఆండ్రాయిడ్ 10 ఆధారిత ఫన్‌టచ్ఓఎస్ 10 సా ఫ్ట్ వేర్ ను కలిగి ఉంటుంది.బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్ గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది. దీంతోపాటు 4జీ వోల్టే, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0 యూఎస్ బీ టైప్-సీ పోర్టు తదితర ఆధునాతన ఫీచర్లు ఈ ఫోన్ లో అందుబాటులో ఉన్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: