స్పేస్‌ ఎక్స్‌ ఇది అమెరికా కు చెందిన ఒక సంస్థ .. ఈ సంస్థ ప్రపంచంలోనే తొలి ప్రైవేట్‌ రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్ట్టించింది. ఆ సంస్థ  యజమాని ఎలన్‌ మస్క్‌. ఇప్పుడు తెలంగాణలోనూ ఓ స్పేస్‌ ఎక్స్‌ ఉంది. దానిపేరే ‘స్కైరూట్‌'. ఇక్కడ  ఇద్దరు ఎలన్‌ మస్క్‌లు ఉన్నారు. వాళ్లే పవన్‌కుమార్‌ చందన, నాగ భరత్‌. రెండున్నరేండ్ల కిందట స్కైరూట్ అనే స్టార్టప్‌ను మొదలుపెట్టి వీళ్లిద్దరు ఇప్పుడు ఆకాశంలోకి రాకెట్ ను పంపించేందుకు రెడీ అవుతున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా అంతరిక్ష పరిశోధన రంగంలోకి అడుగుపెట్టి దేశంలోనే ‘తొలి ప్రైవేట్‌ రాకెట్‌' లాంచింగ్‌కు సిద్ధమవుతున్నారు.

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కు చెందిన మాజీ శాస్త్రవేత్తలు పవన్‌కుమార్‌ చందన, నాగభరత్ ‌తో పాటు ఇంకొందరు  2018 జూన్‌ 12న ‘స్కైరూట్‌' స్టార్టప్‌ను ప్రారంభించారు. ఇప్పుడు స్కైరూట్ తన తొలి ప్రయోగాన్ని ఎప్పుడు ప్రయోగించబోతున్నామో తెలిపింది . ఈ సందర్బంగా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి మొదటి సొంత రాకెట్‌ ను ప్రయోగించబోతున్నామని  పవన్‌కుమార్‌ చందన తెలిపారు. అయితే రాకెట్ ప్రయోగాల కోసం వీళ్ళు ఇస్రో సహకారం తీసుకుంటున్నారు.

ఇక  స్కైరూట్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే   రాకెట్‌ బరువును తగ్గించడం, మరియు  తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం వెళ్లేలా చేయడం, ప్రస్తుతం ఈ సంస్థ ‘స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికిల్స్‌'ను (SSLV) అభివృద్ధి చేస్తున్నది. వీటికి విక్రమ్‌-1, 2, 3 అని నామకరణం చేసింది.   ‘కలాం’ పేరుతో  ప్రత్యేకంగా రాకెట్‌ ఇంజిన్లను రూపొందిస్తున్నది. డిసెంబర్ చివరి నాటికీ  ప్రయోగించబోతున్న  ‘విక్రమ్‌-1’లో ఉపయోగించే  ‘కలాం-5’ ఇంజిన్‌ను ఇటీవలే టెస్ట్‌ ఫైర్‌ చేసింది. విక్రమ్‌-1 ద్వారా    కక్ష్యలోకి ఎక్కువ ఉపగ్రహాలను  పంపేందుకు స్కైరూట్  ప్రయత్నిస్తుంది .. ఇక స్పేస్‌ కేటగిరీలో గత ఏడాదికి గాను నేషనల్‌ స్టార్టప్‌ అవార్డ్స్‌ లో భాగంగా స్కైరూట్‌కు ఉత్తమ సంస్థ అవార్డు దక్కించుకోవడం విశేషం ..



మరింత సమాచారం తెలుసుకోండి: