ఎలక్ట్రానిక్ మొబైల్స్ రోజుకొకటి మార్కెట్ లో దర్శనమిస్తున్నాయి..వేరే కంపెనీకి గట్టి పోటీని ఇస్తూ సరికొత్త ఫీచర్స్ తో యువతను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న టాప్ బ్రాండ్స్ అన్నీ కూడా మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. కాగా, ప్రముఖ ఫోన్ల కంపెనీ సోని మరో కొత్త ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేశారు.. ఆ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..గత సంవత్సరం సోనీ ఎక్స్‌పీరియా 10 II లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు దాని తర్వాత వెర్షన్ అయిన సోనీ ఎక్స్‌పీరియా 10 III స్మార్ట్ ఫోన్ ఫొటోలు, స్పెసిఫికేషన్లు ఆన్ లైన్‌లో లీకయ్యాయి. ప్రముఖ టిప్ స్టర్ ఆన్ లీక్స్ వీటిని లీక్ చేశారు. గతంలో వచ్చిన ఫోన్ల కన్నా కూడా ఈ మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ ఫోన్ ప్రత్యేకతలు ఎంటో ఇప్పుడు చూద్దాం..



ఇందులో 6 అంగుళాల డిస్ ప్లేను అందించనున్నారు. దీని యాస్పెక్ట్ రేషియో 21:9గా ఉండనుంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఇందులో అందించనున్నారు. దీన్ని పైనున్న బెజెల్‌లోనే అందించారు.వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి. లీకుల ప్రకారం వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 8 మెగాపిక్సెల్ టెలిఫొటో, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్లు ఉండనున్నాయి.



ఇకపోతే ఫోన్ కు సైడ్ టచ్ సెన్సార్స్ ను కూడా అందించారు.ఇంకా చెప్పాలంటే స్పీకర్లు ఫోన్ ముందుభాగంలోనే ఉండనున్నాయి. పైభాగంలో 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మందం 0.83 సెంటీమీటర్లుగా ఉండనుంది. దీని ముందువెర్షన్ 0.82 సెంటీమీటర్ల మందంతో లాంచ్ అయింది.గత ఏడాది వచ్చిన ఫోన్ల తో పోలిస్తే ఈ ఫోన్ మరిన్ని ఫీచర్స్ తో యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసిందిి..


మరింత సమాచారం తెలుసుకోండి: