ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర ఆండ్రాయిడ్ మొబైల్  ఉంటుంది. అందులో ప్రతి ఒక్కరికి వాట్సాప్ అకౌంట్ ఉంటుంది. వాట్స్అప్ ద్వారా ఇప్పుడు అన్నీ షేర్ చేస్తుంటాం. మరియు మన పర్సనల్ విశేషాలన్నీ మన ఫ్రెండ్స్ తో, ఫ్యామిలీ మెంబర్స్ తో షేర్ చేసుకుంటాము . అటువంటి వాటిని హ్యాకర్లు హ్యాక్ చేయకుండా ఉండాలంటే,  కింది విధంగా పాటిస్తే సరిపోతుంది.

కొన్ని రోజుల కిందట నుంచి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతూనే ఉండగా,  వాట్సాప్ ను హ్యాక్ చేసి, తప్పుడు మెసేజ్ లతో ఇబ్బంది పెట్టడం చూస్తూనే ఉంటాం. అదేవిధంగా జనాల్ని బురిడీ కొట్టిస్తున్న  ఈ హాకర్స్ కు, వెబ్ సైట్ సోషల్ మీడియా  ద్వారా కొందరు మంది ఖాతాల ఇన్ఫర్మేషన్ ను సాధించి హాకర్స్ కు హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అది ఎలా చేస్తారు అనే దానికి మాత్రం స్పష్టత రాక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బాధితులలో పలువురు సెలబ్రిటీలు,డాక్టర్లు  కూడా ఉన్నారు. అయితే ఎటువంటి ఇబ్బంది రాకుండా ఉండేందుకు కొత్త రకం వాట్సాప్ ను  సెటప్ చేస్తున్నప్పుడు సిమ్ కార్డును ధృవీకరించే కోడ్ మీకు లభిస్తుంది. OTP ద్వారా లేక ఎస్ఎంఎస్ ద్వారా లేక వాట్స్అప్ కాల్ ద్వారా ఆ కోడ్ మనకు వస్తుంది. వాట్సాప్ పాస్ కోడ్ పెట్టుకోవడం ద్వారా మీరు హ్యాకింగ్ నుంచి చాలా ఈజీగా తప్పించుకోవచ్చు.

ముందుగా ఈ పాస్వర్డ్ ను ఎలా సెట్ చేసుకోవాలి అనేది ఇక్కడ చదివి తెలుసుకుందాం. మొదటగా.. whatsapp Setting ఓపెన్ చేయాలి. Tap Account >Two -step verification >Enable. ఆరు అంకెల నెంబర్ ను పెట్టుకోవాలి. మరొక్కసారి నిర్ధారించుకోవాలి. అంతేకాకుండా ఈ - మెయిల్ అడ్రస్ ను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే వదిలేయచ్చు . తర్వాత సేవ్ చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా మీ వాట్సాప్ ను హకర్ల బారినుండి పడకుండా సేఫ్ గా ఉంటుంది.

చూశారు కదా ఫ్రెండ్స్ ఇలా చేయడం వల్ల మీ వాట్సాప్ ను ఎవరూ హ్యాక్ చెయ్యలేరు.

మరింత సమాచారం తెలుసుకోండి: