sbi ( STATE bank OF INDIA)బ్యాంకు ఎప్పటికప్పుడు వినియోగదారుల కోసం సరికొత్త  స్కీమ్ లను ప్రవేశపెడుతూ ఉంటుంది . ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండే  బ్యాంకు. ఎప్పటికప్పుడు  కస్టమర్లకు కావలసిన అన్నీ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకు వస్తూ ఉంటుంది. అందులో భాగంగానే పెన్షనర్ల కోసం సరికొత్త స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం కేవలం ఒక్క ఎస్ఎంఎస్ చేస్తే సరిపోతుంది అని తెలిపింది ఎస్బిఐ. కేవలం ఎస్ ఎం ఎస్ చేస్తే పెన్షన్ కి సంబంధించిన అన్ని వివరాలు మీ మొబైల్ నంబర్ కు వస్తాయి.


కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పెన్షన్ తీసుకునేవారు,  లేదా డిఫెన్స్ పెన్షనర్,ఫ్యామిలీ పెన్షనర్ ఈ పెన్షన్ లోన్ కి అర్హులే  అని ప్రకటించింది ఎస్బిఐ. 9.75 శాతం వడ్డీతో సంతోషంగా రిటైర్మెంట్ తీసుకోవచ్చని పేర్కొంది.
ఈ లోన్ ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


PERSONAL అని టైప్ చేసి 7208933145 అనే నెంబర్ కు మెసేజ్ చేయాలని  ఎస్బిఐ ట్విట్టర్ ద్వారా తమ కస్టమర్లకు తెలిపింది. అలాగే అందుకోసం మరొక ఆప్షన్ కూడా తీసుకువచ్చింది. 7208933142 కు మిస్సేడ్ కాల్ ఇస్తే చాలు, మీకు ఎస్బిఐ కాంటాక్ట్ సెంటర్ నుంచి కాల్ బాక్ వస్తుందట. పిల్లల పెళ్లిళ్లకు, డ్రీమ్ హోమ్ కు, డ్రీమ్ కారు కొనుగోలు చేయడానికి అలాగే  మెడికల్ అవసరాల కోసం రిటైర్మెంట్ ఫండ్ తరహాలో ఎస్బిఐ పెన్షనర్లకు పెన్షన్ లోన్ అందిస్తుంది. పూర్తి వివరాల కోసం ఎస్బిఐ కస్టమర్ కేర్ నెంబర్ 1800-11-2211 కు కాల్ చేసి ఈ పెన్షన్ స్కీమ్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్కీం ద్వారా మొత్తం రూ.14 లక్షల వరకు లోన్ ను పొందవచ్చు.


అంతేకాకుండా ఈ పెన్షన్ స్కీమ్ కు సంబంధించిన అన్ని వివరాలను తెలుసుకోవడానికి అలాగే మే సందేహాలను నివృత్తి చేసుకోవడానికి 1800-11-2211 ఈ టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చేస్తే చాలు. ఈ స్కీమ్ కి సంభంధించిన అన్ని వివరాలను, సందేహాలను ఎస్ బీ ఐ వారు తీరుస్తారు.అయితే మరి  ఇంక ఎందుకాలస్యం.. ఎవరైనా పెన్షనర్లను కోసం ఈ స్కీమ్ కావాలంటే ఎస్బిఐ బ్యాంక్ ను సంప్రదించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: