ఏంటి మరో సరికొత్త కారు అనుకుంటున్నారా..? అవునండీ..ఎప్పటికప్పుడు ఏదో రకమైన మార్పులు సంభవించే మనదేశంలో ఇప్పుడు కూడా వాహన రంగంలో సరికొత్త కారు మన మధ్యలోకి రాబోతోంది.. అందులోనూ మన దేశ రోడ్లపైకి చక్కర్లు కొట్టాలని వస్తోంది.. అదికూడా మూడు చక్రాలు కలిగిన ఎలక్ట్రిక్ సూపర్ కార్.. కార్  పేరు వినగానే అందరికీ ఫోర్ వీలర్ మాత్రమే గుర్తుకు వస్తుంది. కొన్ని గ్యాస్ తో నడుస్తాయి.. కొన్ని పెట్రోల్ తో నడుపుస్తాయి.. మరి కొన్ని డీజీల్ తో నడుస్తుంటాయి. మరి ఇప్పుడు చెప్పే   కారు మాత్రం ఎలక్ట్రిక్ తో నడుస్తుంది. అందులోనూ మూడు చక్రాలు మాత్రమే కలిగి ఉంది.. దీని పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం


పూర్తి వివరాల్లోకి వెళితే కార్ల ఉత్పత్తి తయారీ సంస్థ స్టార్మ్ మోటార్స్ R3  త్రీ వీలర్ బుకింగ్స్ ను షురూ చేసింది. రూ. 10 వేలు చెల్లించి టోకెన్ తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. స్మార్ట్ లుక్ తో అదరగొడుతున్న ఈ కారులో రెండు సీట్ల క్యాబిన్ ఉంటుంది. మంచి టెక్నాలజీ ఫీచర్లను అందిస్తున్నారు. అయితే ఈ కారు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అని కూడా తెలుస్తోంది.. ఇది ఎలక్ట్రిక్ కారు కాబట్టి ఎలాంటి ఆయిల్ దీనికి అవసరం లేదు.


పూర్తిగా ఎలక్ట్రిక్ తో నడుస్తుంది కాబట్టి ఈ కారును ఒక్కసారి ఛార్జ్ చేస్తే రెండు వందల కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు.ఇందులో అన్ని స్టాండర్డ్ ఫుల్ సేఫ్టీ ఫీచర్లతో అందిస్తున్న స్టార్మ్ R3 కార్  ధర సుమారు రూ.  4.5 లక్షలు ఉండొచ్చని ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అయితే ఈ కారు కూడా వారంటి ఉందండోయ్.. స్టార్మ్ R3 ఈ కారును కొనుగోలు చేసిన వారికి మూడు సంవత్సరాల వరకూ లక్ష కిలోమీటర్ల వారెంటీ ఆఫర్న్ ని కూడా కల్పిస్తోంది. కాబట్టి ఈ కారును కొనుగోలు చేయాలనుకునే వారు అతి తక్కువ ధరకే పొందడమే కాక మూడు సంవత్సరాల వారంటీ ను కూడా అందిస్తోంది స్టార్మ్ R3 సంస్థ.

మరింత సమాచారం తెలుసుకోండి: