మోటోరోలా ఫోన్ కంపెనీ మొబైల్స్ ను మాత్రమే కాదు స్మార్ట్ వాచ్ లను కూడా మార్కెట్ లోకి విడుదల చేసింది.ఆ వాచ్ లకు యువత విపరీతంగా ఆకర్షితులు అవుతున్నారు. అదిరిపోయే ఫీచర్స్ తో లాంఛ్ అయిన ఈ ఫోన్ కు మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోన్ పూర్తి వివరాలను ఒకసారి చూద్దాం..స్క్వేర్ డయల్ మోడల్ వాచ్‌ చూడటానికి యాపిల్ స్మార్ట్‌వాచ్ మాదిరిగానే ఉంది. దీనికి సంబంధించిన ఫోటోలు ట్విటర్‌లో లీక్ అయ్యాయి. స్మార్ట్‌వాచ్‌ల విభాగంలో రూపొందిన మొదటి స్మార్ట్ వాచ్..


మోటో 360ని పోలి ఉండే మరో వేరియంట్‌ను కూడా ఆ సంస్థ అభివృద్ధి చేస్తోంది. మోటొరోలా 2015లో మోటో 360ని మార్కెట్లోకి విడుదల చేసింది. తరువాత దీన్ని భారత్‌లో విడుదల చేశారు. కానీ అప్పట్లో ఈ మోడల్‌ కస్టమర్లను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. తాజాగా దీనికి అప్‌డేటెడ్‌ వెర్షన్‌గా మరో కొత్త స్మార్ట్ వాచ్‌ను ఆ సంస్థ తయారు చేస్తోంది.మోటో వాచ్, మోటీ జీ స్మార్ట్ వాచ్‌లు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌, గూగుల్ వేర్ ఓఎస్‌ సపోర్ట్‌తో పనిచేయనున్నాయి. హార్ట్ రేట్ మానిటర్, జీపీఎస్ సెన్సార్, ఇతర ఫిట్‌నెస్‌ ఫీచర్లు ఈ స్మార్ట్‌ వాచ్‌లలో ఉండే అవకాశం ఉంది.
 

షియోమీ రూపొందించిన రౌండ్ డయల్‌ Mi రివాల్వ్ స్మార్ట్ వాచ్, ఇతర వేరియంట్లతో మోటో జీ వాచ్ పోటీ పడనుంది. భారతదేశంలో Mi రివాల్వ్ ధరను రూ.9999గా నిర్ణయించారు..మోటో బ్రాండ్ లైసెన్సింగ్ సంస్థలు స్మార్ట్‌ వాచ్‌లను రూపొందిస్తున్నాయి. ఈ డివైజ్‌ల ఫీచర్లు, స్పెసిఫికేషన్ల గురించి కూడా మోటో అధికారికంగా వెల్లడించలేదు. లీక్ అయిన సమాచారంలో కూడా ఈ వివరాలపై అధికారిక ప్రకటన వెలువడలేదు..యాపిల్ స్మార్ట్‌ వాచ్‌ను పోలి ఉండే స్క్వేర్ డయల్ మోటో వాచ్ ట్రెండీగా కనిపిస్తోంది. దీని ధర మోటో జి వేరియంట్‌ కంటే ఎక్కువగా ఉండవచ్చు.. ఇకపోతే ఒప్పో నుంచి గత వచ్చిన స్మార్ట్ వాచ్ ధర 15000 వేలు పై మాటే.. మరి మార్కెట్లో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: