ప్రస్తుత ప్రపంచంలో ప్రతి ఒక్కరి దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఇప్పుడు మొబైల్ అవసరం. ప్రస్తుతం కరోనా వచ్చిన తర్వాత స్కూల్స్ కాలేజీలు  మూతపడ్డాయి . ఇక ఆన్లైన్ క్లాసులకు అటెండ్ అవ్వాలంటే  కంపల్సరిగా ల్యాప్టాప్ ఉండాలి . కానీ ల్యాప్ టాప్ కొనలేని పరిస్థితిలో ఉన్న ఎంతో మంది పిల్లలు, ఈ సెల్ ఫోన్ మీద ఆధార పడుతున్నారు . అయితే నిరంతరం ఆన్ లో ఉండాలంటే సెల్ ఫోన్ కి ఛార్జింగ్ ఎంతో అవసరం.  కానీ చాలామంది వాపోతున్నారు మొబైల్ ఫోన్ స్లో గా ఛార్జ్ అవుతుంది అని. ఇక ఫోన్ స్లో గా  చార్జింగ్ అవుతుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకోసం ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకునేవారు ఇలా చేస్తే సరిపోతుంది..


నిజానికి ఫోన్ స్లో గా ఛార్జింగ్ అవడానికి చాలా కారణాలు ఉంటాయి. ముందుగా వాటిలో మీ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ డ్యామేజ్ అయినా లేదా ఛార్జింగ్ పోర్ట్ లో ఏదైనా అడ్డుపడినా, ఫోన్ స్లో గా ఛార్జ్ అవుతుంది. ఇక కొందరు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు తమ ఫోన్ కి యూ ఎస్ బీ కేబుల్ ని ఛార్జింగ్ పోర్టు పెట్టేటప్పుడు లేదా ఛార్జింగ్ నుంచి తీసే సమయంలో చాలా బలంగా తీస్తుంటారు . అలా చేయడం వల్ల మీ చార్జింగ్ పోర్ట్ డామేజ్ అయ్యే ప్రమాదం ఉంది.

ముఖ్యంగా కంపెనీ వారు ఇచ్చిన చార్జర్ తోనే మీ మొబైల్ కి చార్జింగ్  కనెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఉపయోగిస్తున్న చార్జర్ లో ఏదైనా సమస్య వచ్చి ఛార్జింగ్ స్లోగా అవుతూ ఉంటుంది. ఒకవేళ ఇవన్నీ బాగుండి కూడా ఫోన్ స్లోగా ఛార్జ్ అవుతోంది అంటే మీ బ్యాటరీ పాడైపోయినట్టు గ్రహించాలి. అంతేకాకుండా మీ ఫోన్లో మాల్వేర్ ఉన్న ఇదే జరుగుతుంది.


ఒకవేళ మీకు ఇలాంటి సమస్య ఎదురైతే వెంటనే మీ ఫోన్ ని రీబూట్ చేసి చూడండి. మీ ఫోన్ ఎదావిధిగా చార్జ్ అవుతుంది. అంతేకాకుండా ఫోన్ చార్జింగ్ చేసే సమయంలో ఇలాంటి జాగ్రత్తలు నిర్వహించాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: