కాలం మారుతున్న కొద్దీ ప్రతి ఒక్కరూ అత్యాధునిక టెక్నాలజీ పైన ఆధారపడాల్సి వస్తోంది.. ఇప్పుడు మరీ ముఖ్యంగా పనివాళ్ళు దొరకడం కష్టంగా మారడంతో, ఇంటిని శుభ్రం చేసుకోవడానికి చాలా మంది వ్యాక్యూమ్ క్లీనర్ పైన ఆధారపడుతున్నారు.  ఒకప్పుడు బాగా డబ్బు ఉన్న వారి ఇళ్ళల్లో, హోటళ్లలో, రెస్టారెంట్లలో మాత్రమే ఈ వాక్యూమ్ క్లీనర్ లను ఉపయోగించేవారు. అంతేకాకుండా వీటి ధర కూడా అప్పట్లో చాలా ఎక్కువగా ఉండడంతో మధ్యతరగతి ప్రజలు వీటిపై పెద్దగా ఆసక్తి చూపించేవారు కాదు..


ఇక పోనుపోను అందరూ టెక్నాలజీ కి అలవాటు పడిన తర్వాత పనిమనుషులు దొరకడం కష్టంగా మారింది. వాక్యూమ్ క్లీనర్ ల ధరలు కూడా కాస్త తగ్గడంతో, ఇప్పుడు వాటి విక్రయాలు బాగానే పెరిగాయి.. అందులోనూ వాక్యూమ్ క్లీనర్ ల ధర చాలావరకు దిగొచ్చింది. కాబట్టి మధ్య తరగతి, సామాన్య ప్రజలు కూడా ఇప్పుడు వాక్యూమ్ క్లీనర్ లను వాడుతున్నారు.. ప్రతి ఒక్కరి ఇంట్లో దుమ్ము,ధూళిని శుభ్రం చేసేందుకు ఈ వాక్యూమ్ క్లీనర్ లను ఆశ్రయిస్తున్నారు..


అయితే సాధారణంగా చాలా పెద్ద పరిమాణంలో ఉండే ఈ వ్యాక్యూమ్ క్లీనర్ లు, ఇప్పుడు కేవలం సెంటిమీటర్ పరిమాణంలోనే రూపుదిద్దుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అది కూడా మన తెలుగు కుర్రాడు తన సత్తా ఏంటో చూపాడు.. అతి చిన్న వయస్సులోనే తన మేధస్సు  అంతా ఉపయోగించి, ఈ అద్భుతాన్ని సృష్టించాడు..


చిత్తూరు జిల్లా..తొట్టంబేడు మండలం.. శేష నాయుడు కండ్రిగ గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి కుమారుడు తపాలా నాదముని అనే ఈ కుర్రాడు ఒక అద్భుతం సృష్టించాడు. చిన్నప్పటి నుంచే విద్యాభ్యాసంతో పాటు ఏదో ఒక కొత్త ఇన్నోవేషన్ తీసుకురావాలని, ఆసక్తి కలిగిన ఈ అబ్బాయి.. అనుకున్న లక్ష్యాన్ని అతి తక్కువ కాలంలోనే చేరుకోగలిగాడు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సీటు సంపాదించి, నూతన ప్రయోగాలకు నాంది పలికాడు.

మొదట 2.2 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన వ్యాక్యూమ్ క్లీనర్ ను రూపకల్పన చేసి, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులో నమోదు కాగా, ఆ తర్వాత తన రికార్డును తానే బద్దలు కొడుతూ, కేవలం 1.7 సెంటీమీటర్ల పరిమాణం కలిగిన వాక్యూమ్ క్లీనర్ ను కనుగొని, గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో  చోటు సంపాదించుకున్నాడు.. ఈ నూతన ఆవిష్కరణలు చేయడం గర్వంగా ఉందని,అతని తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం ఈ అబ్బాయి పదవ తరగతి చదువుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: