ఇప్పుడున్న ప్రపంచంలో ప్రతి ఒక్కటి టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. అందులో భాగంగానే రోడ్డుమీద తిరిగే వెహికల్స్, అందులో అమర్చిన టెక్నాలజీ ద్వారానే అవి వెళ్తుంటాయి. హైవే రోడ్ల మీద ఇంకా చాలా వేగంగా వెహికల్స్ వెళ్తూనే ఉంటాయి... అటువంటపుడు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు,పక్కన ఎవరూ ఉండరు. కనీసం ఫోన్ చేద్దామన్నా సిగ్నల్ ఉండదు. పోనీ ఎవరి నైనా సహాయం అడుగుదామంటే స్పందించరు..దీంతో ఏం చేయాలి..? ఎలా మనల్ని మనం కాపాడుకోవాలి ..? అనే భయం అందరిలో ఉంటుంది . జాతీయ రహదారిపై ఎటువంటి సమయంలో నైనా  ఆపద ఏర్పడితే మీరు ఇక భయం పడాల్సిన పని లేదు. నేరుగా ప్రభుత్వ అధికారులకు తెలియజేసేందుకు అవకాశం ఉంటుందట..అది ఎలాగో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం.


ఇటీవలకాలంలో మనం జాతీయ రహదారి పక్కన నుంచి వెళ్తుంటే ప్రతి రెండు వందల మీటర్ల నుండి మధ్యలో ఒక బాక్స్ కనిపిస్తుంది. ఎవరూ ఈ బాక్స్ ని  పట్టించుకోరు . అంతేకాకుండా ఆ బాక్స్  కరెంట్ దో లేక టెలిఫోన్ కి సంబంధించినదో అని చూసినవారు అనుకుంటారు. కానీ వాటిని  SOS (save our sole ) కాల్ సెంటర్స్ అంటారు. నేషనల్ హైవే అథారిటీ  ఆఫ్ ఇండియా  (NHAI) దీనిని ఏర్పాటు చేసింది. ఈ బాక్స్ తో కూడిన ఫోన్ ప్రతి  200 మీటర్ల  మేరకు ఒకటి ఉంటుంది.


మీకు ఏదైనా ఆపద వచ్చినప్పుడు,మీరు వందకు కాల్ చేయలేని సమయంలో ఈ బాక్స్ మీద ఒక గ్రీన్ బటన్ ఉంటుంది. దానిని లాంగ్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అలా చేయటం వలన అందులో ఏర్పాటు చేసిన సిస్టం ఆటోమేటిక్ గా 112 ఎమర్జెన్సీ కాల్ సెంటర్ కు కనెక్ట్ చేయబడుతుంది. అప్పుడు మీరు వచ్చిన ఆపద గురించి తెలియజేయవచ్చు.


అంతేకాకుండా ఈ కాల్స్ అంబులెన్స్ పోలీసులకు సమాచారాన్ని అందిస్తుందట. అంతేకాకుండా మీరు ఏ ప్రదేశం లో ఉన్నారో కూడా వారికి తెలియజేస్తుంది. దీంతో వారు మీకు సహాయం చేయడానికి త్వరగా రావడానికి వీలవుతుంది. మీరు కూడా ఈ సారి జాతీయ రహదారిపై వెళ్లేటప్పుడు ఈ SOS బాక్సులను అవసరమైతే ఉపయోగించుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: