ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో అదిరిపోయే ఫీచర్లతో మరో స్మార్ట్ ఫోన్ ను మార్కెట్ లోకి విడుదల చేసింది. గతేడాది వీవో వి 20 సిరీస్లో మూడు మోడళ్లను విడుదల చేసిన వివో.. ఇప్పుడు వీవో వి 21 సిరీస్ లాంఛింగ్కు సన్నాహాలు చేస్తోంది. వివో వి 21 స్మార్ట్ఫోన్ను ఏప్రిల్ 27న భారత మార్కెట్లోకి లాంఛ్ చేయనుంది. మనీ కంట్రోల్ ఇచ్చిన నివేదికలో పేర్కొన్న వివరాల ప్రకారం ''స్మార్ట్ఫోన్ ప్రియులు ఎప్పటి నుంచో ఆసక్తిగా ఎదురుచూస్తోన్న వివో వి 21 స్మార్ట్ఫోన్ ఈ నెల చివర్లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. అదే రోజున ఈ స్మార్ట్ఫోన్ అంతర్జాతీయ మార్కెట్లలోకి కూడా రానుంది.


ఒప్పో, రియల్ మి,షియోమి ఎంఐ 11 వంటి స్మార్ట్ఫోన్లకు గట్టి పోటీని ఇస్తుంది.గత ఏడాది విడుదలైన వివో వి సిరీస్తో పోల్చితే, తాజాగా విడుదలకు సిద్ధంగా ఉన్న వివో వి 21 సిరీస్లో అనేక అప్డేటెడ్ ఫీచర్లను జోడించింది.' అని తెలిపింది. కాగా, వివో గతేడాది ఇదే సమయంలో వివో వి 20, వి 20 ఎస్‌ఈ, వి 20 ప్రో మోడళ్లను భారత మార్కెట్లోకి లాంఛ్ చేసింది. అయితే, విడుదలకు సిద్ధంగా ఉన్న వివో వి 21 సిరీస్లో ప్రస్తుతం ఒక్క మోడల్ మాత్రమే లాంఛ్ అవ్వనుందని, ఈ సిరీస్‌లోని వివో వి 21 ప్రో, ఇతర వేరియంట్‌లను అతి త్వరలోనే లాంఛ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.


వివో వి 21 స్మార్ట్ఫోన్లో ఐ ట్రాకింగ్ ఆటోఫోకస్‌తో కూడిన 44 ఎంపి ఫ్రంట్ కెమెరాను జోడించినట్లు తెలుస్తోంది. ఇక, గతేడాది వివో నుండి విడుదలైన వి 20 సిరీస్‌లో కూడా ఐ ట్రాకింగ్ ఆటోఫోకస్‌ ఫీచర్ను అందించడం విశేషం. V21 సిరీస్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, నైట్ మోడ్ కలిగిన 64MP క్వాడ్ రియర్ కెమెరాలను చేర్చింది.. ఫ్యూచర్ లో దీనిని ఇంకా అడ్వాన్స్ చేయనున్నట్లు ప్రకటించారు. వివో వి 21 మోడల్ ధర విషయానికి వస్తే ఇది రూ .30,000 ధరల శ్రేణిలో లభించనుందని తెలుస్తోంది. ఇది ప్రీమియం మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్‌గా విడుదల కానుందని, మునుపటి వేరియంట్ మాదిరిగా కెమెరా సెంట్రిక్ వినియోగ అనుభవాన్ని అందిస్తుందని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఏప్రిల్ 27 న ఈ ఫోన్ లాంఛ్ కానుంది..



మరింత సమాచారం తెలుసుకోండి: