ప్రపంచం తో టెక్నాలజీ పోటీ పడుతుంది.. మనుషులు సులువుగా ఉండే విధంగా రోబోలను రూపొందిస్తున్నారు. కాగా,ఇటీవల ఒక రోబో న్యూస్ రీడర్‌.. వార్తలు చదివి సంచలనం సృష్టించింది. సమయాన్ని, ఖర్చును ఆదాచేసే ఇలాంటి రోబోల వాడకం పెరుగుతోంది. తాజాగా స్విట్జర్లాండ్‌లోని ఒక బార్‌ యజమానులు బార్ని అనే రోబోకు బార్‌టెండర్‌గా  బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు బార్ని సమర్థవంతంగా పని చేస్తోంది. తన పనితీరుతో కస్టమర్లను ఆకట్టుకుంటోది.


కాక్‌టైల్ కలపడం నుంచి కస్టమర్లకు జోకులు వినిపించే వరకు అన్ని పనులూ  చేస్తుంది.. పనులూ చకచకా చేసేస్తుంది. బార్ని మామూలు బార్‌టెండర్ కాదు. ఇది డజన్లకొద్దీ కాక్‌టైల్స్ ‌ను సులభంగా కలిపేస్తుంది. అంతేకాదు అక్కడకు వస్తున్న కస్టమర్ల కు అద్భుతమైన జోకులు చెప్పి వారిని మంచి హుషారు మూడ్ లోకి తీసుకొస్తుంది. ఎఫ్‌&పి రోబోటిక్స్ అనే సంస్థ  ఈ రోబో ను పరిచయం చేసింది.ఈ బార్‌కు `ది బార్ని బార్` అనే పేరు వచ్చింది.. బార్‌టెండర్‌గా పనిచేస్తున్న బార్ని 16 రకాల స్పిరిట్‌లనూ, 8 రకాల సోడాలను అవలీలగా మిక్స్ చేసి సూపర్ కాక్‌టైల్స్ తయారు చేయగలదు. కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ ద్వారా ఇచ్చే ఆర్డర్లకు అనుగుణంగా బార్నీ అన్నింటినీ సజావుగా కలిపి సర్వ్ చేస్తుంది.


బీర్‌, ప్రొసెక్కొ లను కూడా బార్నీ కస్టమర్లకు అందిస్తుంది. ఇంకా, బార్‌పైన వేలాడే పెద్ద వీడియో డిస్ ప్లేలో కస్టమర్ల డ్రింక్ రెడీగా ఉందని తెలుస్తోంది..బార్లు, రెస్టారెంట్లలో రోబోల వాడకం పెరుగుతోంది. కరోనా సమయంలో బార్‌టెండర్‌గా పనిచేసే వ్యక్తులకు బదులుగా బార్ని రోబో వాడకం మంచి విషయమని బార్‌ కస్టమర్లు చెబుతున్నారు. ఈ రోబోలను, వాటి ఆపరేటింగ్ సాఫ్ట్‌వేర్‌ను తయారుచేస్తున్న జ్యూరిచ్ కంపెనీ ఇప్పటికే చైనా, ఒమన్ దేశాలకు రోబోలను అమ్మింది.. ఆ ప్రాంతాల్లో అవి వివిధ రకాలుగా పనులను చేస్తూ అందరి మన్ననలను అందుకుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: