వాట్సాప్ యూజర్లకు భారీ ఇస్తూ ఈ ఏడాది మొదట్లో ఒక ప్రకటన ను సంస్థ వెల్లడించింది.. ప్రైవసీ పాలసీ ను మరింత మెరుగు పరిచే విషయం రూపుందించనున్నట్లు తెలిపారు.ప్రైవసీ పాలసీ పై ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటన అనంతరం వాట్సాప్ అనేక విమర్శల ను ఎదుర్కొంది. అనేక మంది వినియోగదారుల ను సైతం దూరం చేసుకుంది. యూజర్లు తప్పనిసరిగా తమ నూతన ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించాల్సిందేనని వాట్సాప్ తేల్చిచెప్పడంతో వినియోగదారులు యాప్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


 వాట్సాప్ ను వీడి సిగ్నల్, టెలిగ్రామ్ తదితర ఇతర యాప్ ల్లో ఖాతాల ను ప్రారంభించారు అనేక మంది యూజర్లు. దీంతో ఆ సమయంలో ఎట్ట కేలకు వాట్సాప్ వెనక్కు తగ్గింది. వాట్సాప్ లోకి సీక్రెట్ చాట్ ను వేరే వాళ్ళు చదవకుండా ఈ పాలసీ ఉపయోగపడుతుంది... వాట్సాప్‌లో వ్యాపార కోణం లో పంపే మెసేజ్‌ల కు మాత్రమే తమ నూతన అప్‌డేట్ వర్తిస్తుందని వివరించింది వాట్సాప్. ఇదిలా ఉంటే వాట్సాప్ పొడిగించిన మూడు నెలల గడువు త్వరలో ముగియనుంది. 
 

మే 15 నుంచి వాట్సాప్ నూతన ప్రైవసీ పాలసీ అమలు లోకి రానుంది. అయితే ఒక వేళ ఈ ప్రైవసీ పాలసీ నిబంధనలను అంగీకరించకపోతే ఏమవుతుందన్న సందేహం అందరిలో వ్యక్తమవుతోంది. ఇది ఇలా ఉండగా ఇప్పుడు వాట్సాప్ ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది.. నూతన నిబంధనలు అంగీకరించకపోతే ఖాతా డిలీట్ కాబడదని స్పష్టం చేసింది. అయితే వాట్సాప్ సేవల ను మాత్రం పూర్తిగా వినియోగించు కోలేరని తెలిపింది. వినియోగదారులు కాల్స్, నోటిఫికేషన్ల ను మాత్రం పొందగలుగుతారు. కానీ మెసేజ్ లను పంపించడం, చదవడం మాత్రం చేయలేరు. అయితే ఈ అవకాశం కొద్ది రోజుల వరకు మాత్రమే ఉంటుంది.. కానీ ఈ గడువు ఇప్పటివరకు ఉంటుంది అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో జనాలు ఆలోచనలో పడ్డారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: